ఎక్స్‌ప్రెస్ రాజా, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలతో హిట్లు అందుకొన్నాడు మేర్లపాక గాంధీ. రెండు హిట్లతో… మీడియం రేంజు హీరోల చూపు… మేర్లపాకపై పడింది. అలా నానితో సినిమా తీసే అవకాశం అందుకొన్నాడు. అయితే.. `శ్రీకృష్ణార్జున యుద్ధం` సినిమా బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. దాంతో మేర్లపాక ప్రయాణం మళ్లీ మొదటికి వచ్చింది. నితిన్‌తో తీసిన `మాస్ట్రో` కూడా వర్కవుట్ కాలేదు. ఓటీటీ సినిమా `ఏక్ మినీ కథ`తో కాస్త టచ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు అదే సంతోష్ శోభన్ తో `లైక్ షేర్ సబ్ స్క్రెబ్` సినిమా తీశాడు. ఇది త్వరలోనే విడుదల కానుంది. ఇప్పుడు నాని నుంచి మరోసారి ఆఫర్ అందుకొన్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. నాని – మేర్లపాక మరోసారి కలిసి పనిచేయబోతున్నార్ట. ఇటీవల నానికి మేర్లపాక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ వినిపించాడట. దానికి నాని కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. నాని ప్రస్తుతం `దసరా`పై ఫోకస్ పెట్టాడు. ఇది తప్ప తన నుంచి కొత్త సినిమాల సంగతులేవీ బయటకు రాలేదు. మేర్లపాక గాంధీ సినిమాని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి.