అనిల్ రావిపూడి తరువాత సినిమా ఏమిటి? ఎవరితో? ఏ సంస్థతో? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్. బోలెడు మంది నిర్మాతలు క్యూలో వున్నారు. కానీ అనిల్ ఇంకా డెసిషన్ తీసుకోలేదని అంటున్నారు.
అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి తరువాత చేయబోయే సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ అని తెలుస్తోంది. ఆ మధ్య నానితో ఒక సినిమా చేసిన సంస్థకు అనిల్ రావిపూడి ఈ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్ సెంట్రిక్ గా వుండే మాంచి సబ్జెక్ట్ ఒకటి, బాలయ్య కోసం మరోటీ రెడీ చేసుకున్న అనిల్ రావిపూడి ముందుగా ఈ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు సూటయ్యే హీరోయిన్ కావాలి. ఇప్పుడు అదే ఆలోచనలో అనిల్ వున్నట్లు తెలుస్తోంది.
ఒక సినిమా బయట చేసి వస్తానని అనిల్ రావిపూడి తనే దిల్ రాజుకు చెప్పారు. అయితే ఒకటి కాదు, రెండు సినిమాలు బయట చేసి వెళ్తారని, ఆ తరువాతే ఎఫ్3 వుంటుందని బోగట్టా.