వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డితో పాటు అరెస్టవుతున్న నిందితుల కోసం తన ముఖ్యమంత్రి పదవికి ఉన్న పవర్ మొత్తం ఉపయోగించి … మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని బయట పడేసేందుకు బెస్ట్ అన్నట్లుగా కృషి చేస్తున్నారు . ఈ విషయం కళ్ల ముందు కనిపిస్తుంది. ఎందుకు ఇలా ? అనేది మాత్రం చాలా మందికి సస్పెన్స్ గానే ఉంది. అవసరం లేదు…. తనను ఇరికిస్తారు.. తనకు ఇబ్బంది అవుతున్న ఎవరినైనా జగన్ ఇట్టే వదిలించుకుంటారు. మరి అవినాష్ రెడ్డి ఫ్యామిలీని మాత్రం గట్టిగా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. తనపై నిందలు పడిన .. జనాల్లో అనుమానాలు పెరుగుతున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ఎందుకిలా అంటే… అవినాష్ రెడ్డి దగ్గర తీగ లాగితే ఇరుక్కుపోయేది తానేనని జగన్‌కు తెలుసు కాబట్టి అన్న గట్టి అభిప్రాయం వినిపిస్తోంది.
వివేకా హత్య కేసు తనకు 12వ సీబీఐ కేసు అవుతుందని సునీతతో జగన్ ఎందుకన్నారు ?
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల్ని పట్టుకోవాలని సునీత రెండు, మూడు సార్లు సీఎం జగన్ ను కలిసినప్పుడు… ఆయన ఒప్పుకోలేదని సీబీఐకి సునీత స్టేట్మెంట్ ఇచ్చారు. అంతే కాదు డీజీపీ ద్వారా పోలీసు వ్యవస్థను కూడా ప్రభావితం చేశారని ఆమె చెప్పారు. ఓ సందర్భంలో కేసు సీబీఐకి ఇస్తే అవినాష్ రెడ్డి బీజేపీలోచేరుతారని… తనకు పన్నెండో సీబీఐకేసు అవుతుందని కూడా వ్యాఖ్యానించారని సునీత చెబుతున్నారు. అంటే మొత్తం కేసులో గుట్టు ఇక్కడే వీడిపోయినట్లుగా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అక్కడ అవినాష్ రెడ్డి పాత్రధారుడే.. సూత్రధారుడు అసలు ఉన్నాడని స్పష్టమవుతుంది. తాను .. తన కుటుబం నిండా మునిగిన తర్వాత అవినాష్ రెడ్డి జగన్ కోసం అన్నీ తనపై వేసుకుంటారన్న నమ్మకం ఎవరికీ లేదు. ఆయన మొత్తం కుట్ర అంతా వెల్లడిస్తే… పన్నెండో సీబీఐ కేసు జగన్ పై వచ్చినా ఆశ్చర్యం లేదు. అందుకే జగన్ భయపడుతున్నారని అంటున్నారు.
దస్తగిరి తరహాలో అప్రూవర్‌గా మారి అవినాష్ రెడ్డి క్షమాభిక్షకు ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది
దస్తగిరి అప్రూవర్ గా మారడంతోనే అసలు కథ ప్రారంభమయింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా ఆ కేటగిరిలో చేరి తనకు క్షమాభిక్ష పెట్టించుకుంటే… అసలు ఇరుక్కుపోయేది సీఎం వైఎస్ జగన్ మాత్రమే. అవినాష్ రెడ్డి తాను ఏమైపోయినా సీఎం జగన్ ను కాచుకుంటానని ఎక్కడా చెప్పడం లేదు. పైగా తాను ఏమైనా చేస్తానని ఆయన చేతల ద్వారా నిరూపిస్తున్నారు. సీబీఐ చర్యలను ఖండిస్తూ… పులివెందులలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు. క్యాంప్ కార్యాలయం బోర్డు కనబడేలా మీడియా కెమెరాలు ఫిక్స్ అయ్యేలా తాను పొజిషన్ పెట్టుకుని మాట్లాడారు. ఓ రకంగా అది బెదిరింపేనని భావిస్తున్నారు. అలాంటి భయాలు ఉండబట్టే సీఎం జగన్ అవినాష్ రెడ్డి తో పాటు నిందితుల్ని కాపాడటానికి చేయని ప్రయత్నమంటూ లేదన్న వాదన వినిపిస్తోంది.
మాకు సంబంధం లేదని జగన్ దూరం జరిగితే… అవినాష్ రెడ్డి చేయబోయేది అదే !
గతంలో గాలి జనార్ధన్ రెడ్డిని కూడా జగన్ ఆయనెవరు అని ప్రశ్నించారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. నిన్నటికి నిన్న మంత్రి ఆదిమూలం సురేష్.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అసలు కేసును సీబీఐకి ఇవ్వమని అడిగిందే జగన్ అని చెప్పుకొచ్చారు. అప్పుడే జగన్ రెండో వైపు చూస్తున్నారన్న చర్చ జరిగింది కానీ అలాంటి పని చేస్తే అవినాష్ రెడ్డి ఫ్యామిలీ అసలు ఇక వెనక్కి తిరిగి చూడదని.. చేయాలనుకున్నది చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.