అదాని దగ్గర విద్యుత్ ఒప్పందాల కోసం లంచం తీసుకున్న వ్యవహారంలో తనను ఎక్కడ ఇరికించి.. జైలుకు పంపుతారో అని మాజీ విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అందుకే ఆయన రోజూ మీడియా ముందుకు వచ్చి తాను విద్యుత్ ఒప్పందంపై సంతకం చేయలేదంటున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం బాలినేని సంతకం పెడితే అది విద్యుత్ ఒప్పందం అయిందని అంటున్నారు.
ఇప్పటి వరకూ తాను సంతకం పెట్టలేదని అంటున్న బాలినేని తాజాగా.. తన డిజిటల్ సంతకం కూడా వారే పెట్టేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలినేని ఇంత కంగారు పడటానికి కారణాలు ఉన్నాయి. జగన్ రెడ్డి నేరుగా అదానీ నుంచి లంచం తీసుకుని ఉండవచ్చు కానీ అసలు విద్యుత్ మంత్రిగా బాధ్యత మొత్తం బాలినేనిపై పడుతుంది. జగన్ రెడ్డి మనస్థత్వం తెలుసు కాబట్టి ఏమైనా తప్పు జరిగి ఉంటే అది బాలినేనే చేసి ఉంటాడని వాదిస్తారన్న భయంతో ఆయన మీడియా ముందుకు వస్తున్నారు.
అదాని ఒప్పందం విషయం అంత తేలికగా సైడ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. లంచాలు ఏ రూపంలో ఇచ్చారో అమెరికా నుంచి కేంద్రానికి సమాచారం వస్తే అది రాష్ట్రానికి చేరే అవకాశం ఉంది. అమెరికా నుంచి వచ్చిన పెట్టుబడులు అదాని లంచాల కోసమే మళ్లించారని అంటున్నారు కాబట్టి వాటిని ఎటు వైపు.. ఏ పద్దతిలో పంపింగ్ చేశారో.. త్వరలోనే తేలిపోయే ఉంది. అప్పుడు బాలినేనికి పైసా కూడా రానట్లుగా తేలితే ఆయన బయటపడిపోతారు