తెలంగాణలో కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి. రైతులకు సాగునీరు, మహిళలకు బతుకమ్మ పండుగ, యావత్ తెలంగాణకు దసరా ఎంతో స్పెషల్. అందుకే… కేసీఆర్ సర్కార్ బతుకమ్మ పండగు కానుకగా చీరలను ఇవ్వటం స్టార్ట్ చేసింది. సిరిసిల్ల నేతన్నకు చేతినిండా పని… ఆడబిడ్డకు ప్రభుత్వం తరఫున బతుకమ్మ చీర అని గొప్పగా ప్రచారం కూడా చేసుకుంది ఆనాటి కేసీఆర్ సర్కార్.
కానీ, ఆ చీరల నాణ్యతపై ప్రతి ఏటా విమర్శలే. నీ బిడ్డ కవితమ్మ ఈ చీర కట్టుకుంటుందా అని విమర్శించిన వారే అధికం. పంట పొలాల్లో అటవి జంతువులు రాకుండా ఈ చీరలను కట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
అయితే, బతుకమ్మ చీరల విషయంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్… ఇప్పుడు ఆ స్కీం రద్దైనట్లేనన్న సంకేతాలు పంపింది. బతుకమ్మ చీరల నాణ్యత ఏంటో అందరికీ తెలుసు, అందుకే మా ప్రభుత్వం కోటికి పైగా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలందరికీ ప్రతి ఏటా రెండు చీరలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నామన్నది ఆ ప్రకటన సారాంశం.
అంటే… బతుకమ్మ చీరలను ప్రభుత్వం ఇక ఆపేయనుంది. అయితే, మరో నెల రోజుల్లో బతుకమ్మ పండుగ రాబోతుంది. బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేయటం ఈ ఏడాది నుండే స్టార్ట్ అవుతుందా? లేదా వచ్చే ఏడాది నుండా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
కానీ, దీనిపై అధికారిక ప్రకటన రాకపోవటంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఇంకా ఎలా స్పందించ లేదు.