అస్సాంకు చెందిన బిజెపి మహిళా ఎంఎల్ఎ అంగూర్ లతా దేకా ఆధునిక దుస్తుల్లోనూ ఈత దుస్తుల్లోనూ వున్న పోటోలను సోషల్ మీడియా ప్రచారంలో పెట్టడంపై విమర్శలు సరైనవే. ఇప్పుడు ఆ ఫోటోలు ఆమెవి కానేకావంటున్నారు. అది మరీ తప్పు. ఒక వేళ ఆమెవే అయినా రాజకీయ వ్యతిరేకత కోసం చలామణి చేయడం మరింత తప్పు అస్సాంలో సినిమాల అభివృద్ది తక్కువే అయినా వున్నంతలో ఆమె ప్రముఖ నటి.సంచాక నాటకరంగంలో బెనజీర్ భుట్టో పాత్ర వేసి బాగా పేరు తెచ్చుకున్నారు. ఆమె నాయికగా నటించిన మూడు నాలుగు చిత్రాలు బాగా హిట్ అయ్యాయి. సినిమా తారలకు సులభంగా టికెట్టు ఇచ్చే బిజెపి ఆమెను బటద్రోబా నియోజకవర్గంలో పోటీకి నిలిపింది. అంగూరా ఆరువేల ఓట్ల ఆధిక్యతతో ఎన్నికైనారు. తొలి రోజులలో అవకాశాల కోసం తక్కువ రకం పాత్రలు ధరించడం సర్వసాధారణం. సినిమాల్లో ఎలాటి పాత్రలు ధరించినా లేక ఇప్పుడు ఎలాటి దుస్తులు ధరించినా అది వ్యక్తిగత వ్యవహారంగానే చూడాలి. మానసిక రోగులు మత చాందసులు మాత్రమే మహిళలపై ఆంక్షలు ఆధిపత్యాలు రుద్దుతారు. ,శ్రీరాం సేనముతాలిక్ల నుంచి తాలిబాన్ల వరకూ ఆ కోవలో వారే. మహిళలను గౌరవించడం సామాజిక సమానత్వంలో తొలి అడుగు అవుతుంది.