ఒక్కటంటే ఒక్క ఎగ్జిట్ పోల్ లోనూ బీఆర్ఎస్ కు మెజార్టీ వస్తుందని చెప్పకపోగా.. సొంత చానల్ లాంటి టీవీ9 కూడా రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వేయడంతకో బీఆర్ఎస్ క్యాడర్ పూర్తిగా నిరాశలో మునిగిపోయింది. ఆ పార్టీ సోషల్ మీడియా సైనికులు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఓటమికి మానసికంగా సిద్ధమైపోయారు.
బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన అభ్యర్థుల్లోనూ పెద్దగా టెన్షన్ ఉండటం లేదు. ఓటమి ఖాయమన్న ప్రచారం జరుగుతూండటంతో చాలా మంది కౌంటింగ్ ఏజెంట్ల నియామకం విషయంలోనూ పెద్దగా వేలు పెట్టడం లేదు. ప్రధాన అనుచరులకు అప్పగించేస్తున్నారు. తాము అయినా ఖచ్చితంగా గెలుస్తామనుకున్న అభ్యర్థులే కౌంటింగ్ సెంట్రలకు వెళ్లే అవకాశం ఉంది. పోలింగ్ పూర్తయినప్పటి నుంచి కేసీఆర్ ఓటింగ్ సరళిని విశ్లేషించారు. పలువురు నేతలు కేసీఆర్ ను కలిశారు. కానీ పరిస్థితి ప్రోత్సాహకరంగా లేదని అందరికీ అర్థమైంది.
అయితే కౌంటింగ్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే… ప్రభుత్వం మారిపోతుందని తెలిస్తే.. రావాల్సిన సీట్లు కూడా వెనక్కి పోతాయన్న ఉద్దేశంతో .. అందరూ సీరియస్ గా కౌంటింగ్ సెంటర్లకు వెళ్లాలని హైకమాండ్ ఆదేశాలు ఇచ్చింది. బీఆర్ఎస్ కు సైలెంట్ ఓటింగ్ ఉందని నమ్మాలని సందేశం పంపుతున్నారు. అయితే తుది తీర్పు వెలువడే వరకూ… ఎంతో కొంత ఆశలు ఉంటాయి కాబట్టి అద్భుతం జరగాలని కోరుకుంటున్నారు. బెంగాల్ ఎన్నికల సమయంలో మైయాక్సిస్ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ తప్పు అయిందని.. తెలంగాణలోనూ అదే జరుగుతుందని భావిస్తున్నారు.