తెలంగాణ ముందస్తు ఎన్నికలకు కేంద్రం సంపూర్ణంగా సహకరించిందా..?. తెలంగాణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫైల్స్ అన్నీ క్లియర్ చేసేసిందా..? ఏపీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పైల్స్‌ను కనీసం పరిశీలనకు కుడా తీసుకోకుండా.. తెలంగాణ విషయంలో మాత్రం పూర్తి మినహాయింపు ఇచ్చేసిందా..? అవుననే అంటున్నారు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ముందస్తుకు వెళ్లడానికి అడ్డంకిగా.. పరిష్కారం కాకుండా ఉన్న తెలంగాణ బిల్లలన్నింటినీ కేంద్రం ఆమోదించేసిందట. దీనికి సంబంధించి… ఒక్క జోన్ల ఆమోదం మాత్రమే… అధికారికంగా ప్రకటించారు. కానీ బయటకు తెలియకుండా.. అనేక బిల్లులను క్లియర్ చేశారని చంద్రబాబు చెబుతున్నారు. అది కూడా.. నిబంధనలకు విరుద్ధంగా ఆమోదిస్తున్నారని చంద్రబాబు అంటున్నారు.
జోన్ల విషయంలో స్థానికులకు 95 శాతం నిబంధన పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్న అభిప్రాయం ఉంది. మొదటగా అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేంద్రం.. ఆ తర్వాత మాత్రం… 95 శాతానికి ఆమోదం తెలిపింది. అదే ఏపీ విషయంలో మాత్రం.. ఎలాంటి నిబంధనల అతిక్రమణ లేకపోయినా కొన్ని బిల్లులను పెండింగ్‌లో పెట్టేసింది. దీనిపైనే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం వివక్షపూరిత వైఖరిని నిరసిస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంపై కేంద్రం, అణచివేత వివక్ష కోనసాగిస్తోందని మండిపడ్డారు.
తెలంగాణ విషయంలో కేంద్రం.. కేంద్రం విషయంలో తెలంగాణ… పరస్పర సహకారంతో కొనసాగుతున్నాయి. చివరికి జమిలీ ఎన్నికల జపం చేసిన రెండు పార్టీలు … జమిలీగా ఎన్నికలు జరపాల్సిన చోట కూడా.. విడివిడి ఎన్నికలకు సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ముందస్తు జరిగేలా చూస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో స్వీప్ చేయవచ్చని…ఆ సీట్లన్నీ బీజేపీకి వచ్చినట్లేనని కేసీఆర్ బీజేపీ నాయకత్వాన్ని నమ్మించినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి వాళ్లు ఫ్లాటయ్యారు. ఎందుకంటే.. దక్షిణాదిలో టీఆర్ఎస్ లాంటి మిత్రపక్షాలపైనే వారు ఆశలు పెట్టుకున్నారు మరి…!