తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును… టీఆర్ఎస్ అధినతే కేసీఆర్ రాక్షసిగా పోల్చుతున్నారు. తెలంగాణలోకి అడుగు పెట్టనీయవద్దని పిలుపునిస్తున్నారు. ఆయనను ఎక్కడిక్కడ అడ్డుకోవాలని అంటున్నారు. అత్యంత దారుణంగా.. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఇంతకీ చంద్రబాబు చేసిన నేరం ఏమిటి..? తెలంగాణలోకి అడుగు పెట్టనీయకుండా చేసిన పాపం ఏమిటి..? తెలంగాణకు చంద్రబాబు రాక్షసి ఎలా అయ్యారు..?
సెంటిమెంట్ రెచ్చగొట్టాలంటే చంద్రబాబునే చూపించాలా…?
తెలంగాణవాదుల్లో సెంటిమెంట్ పెరగాలంటే.. టీఆర్ఎస్ నేతలకు… ఆ పార్టీ అధినేతకు ఉన్న ఒకే ఒక్క దారి చంద్రబాబునాయుడ్ని టార్గెట్ చేసుకోవడం. అలా చంద్రబాబును విమర్శిస్తే.. ప్రజల్లో సెంటి్మెంట్ పెరుగుతుదని అనుకుంటారు. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు ప్రచార కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఓ దశలో.. చంద్రబాబు.. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి కూడా రాకూడదనుకున్నారు. కానీ.. తెలంగాణ ప్రజల్లో తననో విలన్ గా కేసీఆర్ చిత్రీకరించడం ప్రారంభించారు. దీంతో కేసీఆర్కు కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకే ప్రచారానికి సిద్ధమయ్యారు. కేసీఆర్ తనను అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమిటో ప్రజలకే చెప్పాలనుకుంటున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ చెబుతున్న లేఖలు.. ఇతర అంశాల గురించి చంద్రబాబు.. తెలంగాణ సభల్లోనే వివరణ ఇవ్వబోతున్నారంటున్నారు.
తెలంగాణకు చంద్రబాబు చేసిన అన్యాయం ఏమిటి..?
తెలంగాణకు చంద్రబాబు అన్యాయం చేశారంటూ.. కేసీఆర్ ఆయన కుటుంబం తెగ చెబుతోంది కానీ.. ఏం అన్యాయం చేశారో మాత్రం చెప్పలేకపోతున్నారు. ఆయన చేసిన తప్పేమిటో చెప్పలేకపోయారు. కానీ..చంద్రబాబు ఆంధ్రప్రాంత నేత అన్న కారణాన్ని మాత్రం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. చంద్రబాబు సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో నాలుగున్నరేళ్లు కేసీఆర్ మంత్రిగా ఉన్నారు. తర్వాత ఐదేళ్లలో… తెలంగాణ పురోగమించింది. చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదిగింది. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పడిన కష్టం.. అప్పటి టీడీపీ నేతలకు తెలుసు. అప్పటికీ ఊహ తెచ్చుకున్న నేటి అనుభవజ్ఞులైన నాటి యువతరానికీ తెలుసు. కానీ.. ఉడుకు రక్తంతో.. కేసీఆర్ చెప్పే మాటల్ని వినే… పాతికేళ్ల కుర్రాళ్లు.. తమ ముందు ఏం జరిగిందో… తెలుసుకోలేక..కొంత మంది ఆవేశ పడిపోతూ ఉంటారు. కానీ.. చంద్రబాబు తెలంగాణకు చేసిన అన్యాయమేంటో.. ఎవరూ చెప్పలేదు.
ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఎలా ఏర్పడింది..?
తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడటంమే.. ఇరవై వేల కోట్ల మిగులుతో ఏర్పడింది. తెలంగాణను చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తే.. ఆ తర్వాత వచ్చిన పాలకులు… నిర్లక్ష్యం చేస్తే.. ఇంత భారీ మిగులు బడ్జెట్ తో ఎలా రాష్ట్రం ఏర్పడుతుంది. :హైదరాబాద్ అభివృద్ధి విషయంలో.. తన కృషిని సగర్వంగా చెప్పుకోవడానికి చంద్రబాబు ఎప్పుడూ ఉత్సాహపడతారు. తాను హైదరాబాద్ లోని అవకాశాలను వివరించేందుకు… న్యూయార్క్ వీధుల్లో.. ఫైల్స్ మోసుకుంటూ….తిరిగిన విషయాన్ని ఘనంగా చెప్పుకుంటారు. తన కృషి వల్లే హైదరాబాద్ ఈ స్థితిలో ఉందని… చెప్పడంలో ఆయన కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఈ విషయంలో చంద్రబాబు ముద్రను ఎవరూ కాదనలేరు. కేసీఆర్ కూడా కాదనలేరు. కేటీఆర్, కవిత కూడా కాదనలేరు. వారు మనస్ఫూర్తిగా చెప్పిన మాటలు.. ఇప్పటికీ ఇంటర్నెట్ లో వైరల్ గానే ఉన్నాయి.
టీఆర్ఎస్ భవిష్యత్ పై భయంతోనే నిందలా..?
టీడీపీపై.. తెలంగాణ ప్రజల్లో అభిమానం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల.. దక్షిణ తెలంగాణలోని బీసీ వర్గాల్లో తెలుగుదేశం పార్టీపై అమితమైన అభిమానం ఉందని.. చెబుతూ ఉంటారు. నాయకులు లేరు కాబట్టి.. వారంతా తప్పనిసరిగా .. ఇతర పార్టీల వైపు చూస్తున్నారు కానీ.. తమకంటూ.. నాయకత్వం ఉంటే.. కచ్చితంగా టీడీపీ వైపే ఉంటారనేది చాలా మంది నమ్మకం. అలాంటి నాయకత్వం లేకుండా చేయడానికే.. కేసీఆర్ ప్రయత్నించారు. దాదాపు సక్సెస్ అయ్యారు. మళ్లీ చంద్రబాబు తన ప్రచారంతో అలాంటి భరోసా ఇస్తారన్న ఉద్దేశంతోనే.. వీలైనంతగా టీడీపీని డిఫెన్స్ లో పడేసే ప్రయత్నం చేశారన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.. . తెలంగాణలో టీడీపీ ఉండకూడదని.. అలా ఉంటే.. టీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్ కు ఇబ్బంది అవుతుందన్న కారణంగానే.. ఆయన టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. అంతే తప్ప.. చంద్రబాబును .. తెలంగాణ రాక్షసిగా చిత్రీకరించడంలో.. ఎలాంటి ఔచిత్యం లేదు.
——-సుభాష్