తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. అందుకే ఆయన ప్రాంతీయ పార్టీల అధినేతవల వద్దకు ప్రత్యేక విమానాలు కట్టుకుని మరీ తిరుగుతున్నారు. అయితే ఆయన కాంగ్రెస్‌కు దగ్గరయ్యే అవకాశం ఉన్న పార్టీల వద్దకే వెళ్తున్నారు తప్ప.. ఇప్పటికే బీజేపీతో రహస్య ఒప్పందాలు చేసుకుని.. బహిరంగ సపోర్ట్ చేస్తున్న పార్టీల జోలికి వెళ్లడం లేదన్న విమర్శలున్నాయి. కాంగ్రెస్‌కు మద్దతుగా పార్టీలన్నీ ఏకం కాకుండా.. ప్రత్యేకంగా ఓ కూటమి కడితే… బీజేపీకి లాభమని.. ఆ దిశగా కేసీఆర్‌ను.. మోదీ, అమిత్ షా… ప్రేరేపించారన్న విశ్లేషణలు కొద్ది రోజులుగా వస్తున్నాయి. మాటలతో మాత్రం కేసీఆర్ .. ఈ ప్రచారాన్ని తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నారు. కానీ చేతలలో మాత్రం… నిజమేనన్నట్లు ప్రవర్తిస్తున్నారు. పార్లమెంట్లో కొన్నాళ్ల పాటు అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా.. అన్నాడీఎంకేతో కలిసి ఆందోళనలు చేశారు. ఆ తర్వాత ఇవే విమర్శలొచ్చేటప్పటికి వెనక్కి తగ్గారు. కానీ … అన్నాడీఎంకేతో బీజేపీ పని పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కూడా మోదీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఏమైనా చేసిందా.. అంటే.. అలాంటి చాన్సులొచ్చినా కూడా పట్టించుకోలేదు. పదిహేనో అర్థిక సంఘం విధివిధానాల వల్ల…దక్షిణాది..దారుణంగా నష్టపోనుందన్న అంచనాలున్నాయి. దీనిపై పోరాడటానికి దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమయ్యాయి. కానీ…తెలంగాణ, తమిళనాడు అధికార పార్టీలు టీఆర్ఎస్, అన్నాడీఎంకే మాత్రం దూరంగా ఉన్నాయి. ఈ రెండింటినే.. బీజేపీ రహస్య మిత్రులన్న ముద్ర కూడా ఉండటం ఇక్కడ గమనార్హం.
జాతీయ రాజకీయాల్లో రెండు దశాబ్దాల కిందటే.. తనదైన ముద్ర వేసిన… చంద్రబాబు… ఇప్పుడు మళ్లీ పరోక్షంగా అలాంటి కీలక పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు. ఎన్నికల తర్వాతే కూటమి కట్టాలన్న ఆలోచనలో ఉన్న ఆయన.. ఇప్పటికే ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. దీన్ని గమనించే.. ప్రధానమంత్రి మోదీ. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పోటీ కూటమి పెట్టాలని కేసీఆర్‌ను ప్రొత్సహించారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ చంద్రబాబు అంత తేలికగా దొరకడు కదా.. ? జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదంటూ.. బీజేపీకి వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఆర్థిక మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వ్యూహాత్మకంగా … ఫ్రంట్ ప్రయత్నాల్లో రన్నింగ్ చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికీ ఆహ్వానం పంపారు. కానీ అంగీకరించలేని పరిస్థితి కేసీఆర్‌ది. ఆర్థిక మంత్రుల సమావేశానికి వెళ్తే.. కేంద్రానికి వ్యతిరేకం అయినట్లు ఉంటుంది. చంద్రబాబు నేతృత్వంలో కేంద్రంపై సాగుతున్న యుద్ధానికి మద్దతు పలుకినట్లు అవుతుంది. వెళ్లకపోతే.. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు బీజేపీ కోసమేనన్న అనుమానాలు బలపడతాయి. అందుకే కేసీఆర్ చిక్కుల్లో పడిపోయారు. చివరికి సమావేశానికి వెళ్లకూడదనే నిర్ణయించుకున్నారు.
తెలంగాణ సాధించుకున్నది వివక్ష అనే బీజం ప్రజల మనసుల్లో నాటడం ద్వారానే. కానీ కేసీఆర్ ఇప్పుడు.. అలాంటి భావనే వద్దని ప్రజలకు సుద్దులు చెబుతున్నారు. అందుకే దక్షిణాది పేరుతో జరిగే రాజకీయాలకు దూరం అంటున్నారు. కానీ నమ్మేవాళ్లే లేరు. ఇప్పటి వరకూ.. బీజేపీకి మద్దతుగానే ఫెడరల్ ఫ్రంట్ అంటూ వస్తున్న విమర్శలు.. అమరావతిలో ఆర్థిక మంత్రుల సమావేశం తర్వాత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు .. ఎన్ని పార్టీలను కలిసినా.. ఒక్కరు కూడా.. కలసి పని చేద్దామని చెప్పలేదు. ముందు ముందు అపాయింట్మెంట్లు కూడా దొరకకపోవచ్చు. అంటే రాజకీయాలకు సంబంధం లేదని ఒక్క సమావేశంతో..బీజేపీ అనుకూల ఫెడరల్ ఫ్రంట్‌కు చంద్రబాబు చెక్ పెట్టేశారని..రాజకీయవర్గాలు.. విశ్లేషిస్తున్నాయి. ఆలోచిస్తే..నిజమేననిపించకమానదు…!