చిరు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడిప్పుడు. `ఆచార్య` తరవాత కూడా చేతినిండా సినిమాలున్నాయి. అందులో ఏకే ఎంటర్టైన్మెంట్స్ తో ఒకటి. వేదాళంకి ఇది రీమేక్. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు. `ఆచార్య` పూర్తయిన వెంటనే… ఈ సినిమానే పట్టాలెక్కుతుంది. ఈ సినిమా కోసం చిరుకి ఏకంగా రూ. 60కోట్లు పారితోషికం ఫిక్స్ చేశారని, ఎగ్రిమెంట్లు కూడా అయిపోయాయని ప్రచారం జరుగుతోంది. `ఆచార్య` కోసం చిరు రూ. 50 కోట్లు తీసుకుంటున్నాడని, అందుకు రూ. 10 కోట్లు ఎక్కువే వేసి ఇచ్చారన్నది వార్త.
నిజానికి.. ఈ సినిమా ఇంకా పైప్ లైన్లోనే ఉంది. ఎవరికి ఎంత పారితోషికం అన్నది ఫిక్స్ అవ్వలేదు. పారితోషికం విషయంలో నిర్మాతలకూ, చిరుకీ మధ్య ఎలాంటి బేరసారాలూ జరగలేదట. ఏకే ఎంటర్టైన్మెంట్స్కి చిరు సినిమా చేయడం ఖాయమైంది. అంతే తప్ప.. పారితోషికం ఇంత అని ఫిక్సవ్వలేదు..“ అని మెగా కాంపౌండ్ సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. `వేదాళం` రీమేక్ మార్చిలోగానే మొదలవ్వదు. చిరు దృష్టి ఇప్పుడు పూర్తిగా `ఆచార్య` పైనే ఉంది. ఇది పూర్తయ్యాకే.. `వేదాళం` సినిమా పై ఫోకస్ చేస్తారు. అప్పుడు.. పారితోషికం లెక్కలు బయటకు వస్తాయి.