తెలంగాణలో సోదరి షర్మిల పార్టీ బలోపేతానికి సీఎం జగన్ తన వంతు సాయం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసినట్లని చెప్పుకుంటున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అటు కాంగ్రె… ఇటు బీజేపీ కాకుండా… విచిత్రంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ చేరికల వెనుక ఏపీ సీఎం జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన శుక్రవారం తాడేపల్లిలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షర్మిల పార్టీలో చేరికపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆ తర్వాత బీఆర్ఎస్ చేరారు. జగన్ అనుమతి తీసుకునే చేరారని చెబుతారు. ఆ తర్వాత కూడా జగన్ తో పొంగులేటి దగ్గర సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఆయనకు కొన్ని కాంట్రాక్టులు కూడా లభించాయి. ఆయనకు కడప జిల్లాలో జగన్ బందువులతో .. వియ్యం అందుకున్నారని చెబుతారు. అందుకే ఇప్పుడు.. ఖమ్మం జిల్లాలో షర్మిల పార్టీ బలోపేతానిక ిపని చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు, సీఎం జగన్ కు మధ్య సంబంధాలు అంత గొప్పగా లేవన్న ప్రచారం ఉంది. ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్న పొంగులేటిపై చర్యలు తీసుకునేందుకు హైకమాండ్ వెనుకంజ వేస్తోంది. బయటకు జగన్, షర్మిల మధ్య విభేదాలంటున్నా.. అంతా వ్యూహాత్మకంగానే రాజకీయం చేస్తున్నారని అందులో భాగంగానే..షర్మిలను కూడా తెలంగాణలో పార్టీ పెట్టించి.. ఎన్నికల ముందు.. జగన్ తో అనుబంధం ఉన్న కీలక నేతల్ని చేరుస్తున్నారన్న అనుమానాలు పొంగులేటితో ప్రారంభమవుతున్నాయి.