ఈ గురువారం విడుదలైన సినిమా `దేవదాస్`. టాక్ కాస్త అటూ ఇటూగా ఉన్నా వసూళ్లు బాగానే ఉన్నాయి. చివరి నిమిషాల్లో మార్పుల వల్ల.. కొన్ని సీన్లు కట్ చేయడం వల్ల… జంపింగ్లెక్కువగా కనిపిస్తున్నాయి. దాన్ని సవరించడానికి చిత్రబృందం ఇప్పుడు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ద్వితీయార్థంలో రెండు కొత్త సన్నివేశాలు కలపాలని చిత్రబృందం భావిస్తోంది. నిడివి ఎక్కువ అవుతోందని భావించి ట్రిమ్ చేసిన ఆసీన్లు ఇప్పుడు యాడ్ చేస్తే… ఎలా ఉంటుందన్నది దర్శక నిర్మాతల ఆలోచన. క్యూబ్ సిస్టమ్ వచ్చాక సన్నివేశాల్ని మళ్లీ పేర్చడం అంత తేలిక కాదు. దానికి ఖర్చు కూడా అవుతుంది. ఇప్పుడు కొత్తగా పేర్చిన సన్నివేశాల వల్ల రిపీటెడ్ ఆడియన్స్ రారు. కేవలం తొలిసారి చూసిన ప్రేక్షకులకు.. సినిమా టెంపో చెడకుండా ఉండడానికే ఈ యాడింగులు. అయితే ఆ సన్నివేశాల్ని శనివారం కల్లా జోడిస్తే.. సోమ, లేదంటే మంగళవారం కొత్త సన్నివేశాలున్న `దేవదాస్`ని చూడొచ్చు. అయితే అప్పటికీ వసూళ్లు చల్లబడతాయి. కాబట్టి ఈ మార్పులు అంతగా లాభం చేకూరకపోవొచ్చు. సన్నివేశాలు కలపాలా, వద్దా? అనే విషయంలో ఈరోజు సాయింత్రానికల్లా చిత్రబృందం ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.