‘శ్రీమంతుడు’లో గ్రామాల దత్తత గురించి డిస్కస్ చేసిన దర్శకుడు కొరటాల శివ, తాజా ‘భరత్ అనే నేను’లో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తున్నాడా? ఇందులో మహేశ్ విజయ్ ఇండియాలో ఎడ్యుకేషన్ టాపిక్యేనా? సోషల్ మీడియాలో, మహేశ్ అభిమానుల్లో హాట్ టాపిక్ ఇది! అందుకు కారణం ఈ రోజు విడుదల చేసిన ఒక పోస్టర్. ‘శ్రీమంతుడు’ సక్సెస్ తర్వాత మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా ‘భరత్ అనే నేను’. డి.వి.వి. దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో మహేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ‘విజన్ ఆఫ్ భరత్’ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఉదయం ఒక స్టిల్ విడుదల చేశారు. అది సీఎంగా మహేశ్ కేబినెట్ మీటింగ్ నిర్వహించే సమయంలో స్టిల్ గా తెలుస్తోంది. అందులో మహేశ్ ముందున్న ల్యాప్‌టాప్‌లో ఒక న్యూస్ కనిపిస్తుంటుంది. అది ‘ద వ్యూస్ పేపర్ డాట్ నెట్’లోని ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఆర్టికల్. పెద్ద పెద్ద దర్శకులు తమ సినిమాల్లో చిన్న చిన్న లింక్స్ కూడా మిస్ కాదు. అందులో ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఆర్టికల్ వుంది. ఇటీవల బుర్రిపాలెంలో మహేశ్ స్కూల్ కట్టించారు. కనుక… సినిమాలో ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేసే ఛాన్స్ వుంది. ప్రేక్షకులు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసేలోపు సాయంత్రం ఆరు గంటలకు ‘విజన్ అఫ్ భరత్’ విడవలవుతుంది. ‘శ్రీమంతుడు’ సినిమా సమయంలో తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను మహేశ్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.