శ్రీరెడ్డి అనే వర్థమాన నటి.. తెలుగు కళాకారులకు అవకాశాలివ్వాలనే డిమాండ్ తో ప్రారంభించిన చిన్నపాటి ఉద్యమం..ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్ లోని రాజకీయాలను కూడా బహిర్గతం చేస్తోంది. ఎక్కువగా నిర్మానుష్యంగా కనిపించే ఫిల్మ్ చాంబర్ వీటన్నింటికి వేదికవుతోంది. నెల రోజులుగా రగులుతున్న శ్రీరెడ్డి ఇష్యూను ఇప్పుడు మెగా ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.తమ కుటుంబంపై కుట్ర చేశారంటూ.. వారిని బలి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తోంది.
మెగా కాంపౌండ్ ఫిల్మ్ చాంబర్ లో బలప్రదర్శన చేసి.. ప్రధానంగా రెండు డిమాండ్లను.. చాంబర్ ముందు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి రామ్ గోపాల్ వర్మను టాలీవుడ్ నుంచి బహిష్కరించడం. రెండు.. టాలీవుడ్ కు సంబంధించిన ఏ కార్యక్రమానికి టీవీ నైన్, టీవీ ఫైవ్, ఏబీఎన్ లను ఆహ్వానించకుండా ఉండటం. అంటే బహిష్కరించడం. ఈ రెండు డిమాండ్లను ఇరవై నాలుగ్గంటల్లో నేరవేర్చాలని పవన్ కల్యాణ్ డెడ్ లైన్ పెట్టిన తర్వాతే.. ఇంటికెళ్లారు. ఈ డిమాండ్లన్నింటికీ మెగా కాంపౌడ్ పూర్తి స్థాయిలో మద్దతు పలికింది.
కానీ టాలీవుడ్ అంటే.. ఒక్కమెగా ఫ్యామిలీనే కాదు కదా..తమకు నచ్చలేదని..ఓ దర్శకనిర్మాతపై పూర్తి స్థాయిలో బహిష్కరణ వేటు వేయడం అంత తేలికైన విషయం కాదు. పైగా… ఆ దర్శకుడు నిర్మించి తెరకెక్కించిన.. అగ్రహీరో సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్ధమయింది. ఈ తరుణంలోబ్యాన్ వేయడమంటే.. టాలీవుడ్ లోని ఇతర వర్గాలనుంచి వ్యతిరేకత వస్తుంది. ఏదో చర్య తీసుకుని సరిపెట్టేలని… టాలీవుడ్ పెద్దలు భావిస్తున్ారు. అలాగే మీడియా విషయంలో…టాలీవుడ్ ఏ మాత్రం దూకుడుగా వెళ్లడం మంచిది కాదని సినీ పెద్దలు వాదిస్తున్నారు. కానీ మెగా కాంపౌండ్ మాత్రం ఆ చానళ్లను నిషేదించాలనే సింగిల్ డిమాండ్ వినిపిస్తోంది.
మొత్తానికి చాంబర్ మీటింగ్ లో… సంచలనాత్మక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఈ నిర్ణయాలను బట్టి మెగా ఫ్యామిలీ.. టాలీవుడ్ లో…తమదే ఆధిపత్యం అని నిరూపించుకుంటుందో… లేక.. వేరే వర్గంగా మారి.. అసంతృప్తవాదులుగా మారిపోతారో తేలిపోనుంది. కానీ ఇండస్ట్రీ శ్రేయస్సు దృష్ట్యా పవన్ కు ఈ రెండు విషయాలపై సర్ది చెప్పేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారు. కానీ పవన్ ఒక్కసారి కమిటైతే.. ఆయన మాట ఆయనే వినని టైపు. అందుకే ప్రయత్నాలు ఫలించడం లేదు. ఏం జరుగుతుందో.. వేచి చూడాల్సిందే..!