గీతా ఆర్ట్స్ నుంచి ఓ సినిమా వస్తోందంటే మినిమం గ్యారెంటీ ఆశలు ఉంటాయి. నాగచైతన్య – సాయి పల్లవి…ఈ కాంబోకి ఓ క్రేజ్ ఉంది. పైగా చందూ మొండేటి దర్శకుడు. అందుకే ‘తండేల్’పై ఆశలు, అంచనాలూ పెరిగాయి. దానికి తోడు బ్యాక్ డ్రాప్ కూడా కొత్తగా అనిపిస్తోంది. చైతూ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమా అని చిత్రబృందం డిక్లేర్ చేసింది కూడా. అందుకే `తండేల్`పై నమ్మకాలు మరింతగా పెరిగాయి. జనవరి సీజన్లో ఈ సినిమాని విడుదల చేస్తారని అంతా అనుకొన్నారు. కానీ ఇప్పుడు ఫిబ్రవరికి షిఫ్ట్ అయ్యింది. ఈ విషయంలో అభిమానులు కాస్త నిరాశ చెందారు. కాకపోతే… చిత్రబృందం మాత్రం పోటీలో రావడం కంటే, సోలోగా వచ్చి సేఫ్ అయిపోవడం బెటర్ అని భావిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, నాన్ థియేట్రికల్ బేరాలు కూడా క్లోజ్ అయ్యాయని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ రూ.40 కోట్లకు ఓటీటీ హక్కులు చేజిక్కించుకొందని సమాచారం. ఆడియో రైట్స్ కింద మరో రూ.10 కోట్ల వరకూ వచ్చాయట. అంటే.. మొత్తంగా రూ.50 కోట్లు. హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా మంచి రేటుకే అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయా హక్కుల రూపంలో కనీసం రూ.20 కోట్లు వస్తాయని లెక్కగడుతున్నారు. మొత్తంగా నాన్ థియేట్రికల్ నుంచి రూ.70 కోట్లు రాబడుతోంది. ఈ సినిమాకు మొత్తంగా రూ.100 కోట్లు ఖర్చయ్యాయని తెలుస్తోంది. అంటే థియేట్రికల్ గా మరో రూ.30 కోట్లు తెచ్చుకొంటే ‘తండేల్’ సేఫ్ జోన్లో పడిపోయినట్టే. ఈ ప్రాజెక్ట్‌కి ఉన్న క్రేజ్ ని చూస్తే విడుదలకు ముందే నిర్మాతలు లాభాలు చవి చూసే అవకాశం పక్కాగా కనిపిస్తోంది.