ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ విభజన హామీలు అమలు చేయడం లేదు. ప్రకృతి విపత్తులొస్తే రూపాయి విదల్చడం లేదు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకుని… కొత్త తరహా వేధింపుల రాజకీయం చేస్తోంది. వీటన్నింటితో … పాటు జీవీఎల్ అనే యూపీ ఎంపీ.. తాను ఏపీ వాడినని చెప్పుకుంటూ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై.. తీవ్రమైన అవినీతి ఆరోపమలు చేస్తూ..ఎప్పుడూ రచ్చ చేస్తూ మీడియాలో హడావుడి చేస్తున్నారు. పీడీ అకౌంట్లు అంటే… టీడీపీ నేతల అకౌంట్లంటారు. సీబీఐ విచారణకు సిద్ధం కావాలని సవాల్ చేస్తారు. చంద్రబాబుకు ఐక్యరాజ్య సమితి ఇన్విటేషన్ వస్తే.. అదంతా ఫేక్ అంటారు. తీరా చంద్రబాబు అక్కడికి వెళ్లి ప్రసంగిస్తే అదో స్కామ్ అంటారు. ఈ రచ్చ అలా సాగుతూనే ఉంది.
అందుకే.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. అసలు జీవీల్ రచ్చ సంగతేమిటో తేల్చాలని ఓ డిబేట్ పెట్టారు. దానికి జీవీఎల్ వచ్చారు. ఏబీఎన్ డిబేట్లో… ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ… సూటిగా.. జీవీఎల్ ను అడిగేశారు. ” పీడీ అకౌంట్ల దగ్గర్నుంచి పరిశ్రమలకు రాయితీల వరకు.. వేల కోట్ల అవినీతి ఆరోపణలు చేశారు. మీడియా ముందు గోల చేశారు. ఇప్పటి వరకూ జరిగింది సరే.. ఇప్పుడు… మీ దగ్గరున్న ఆధారారాలతో కోర్టుకు వెళ్లడమో… విచారణ సంస్థలకు ఫిర్యాదు చేయడమో చేయవచ్చు ” కదా అని ప్రశ్నించారు. ఇది సూటిగా సుత్తి లేకుండా అడిగిన ప్రశ్న. దీనికి కూడా.. జీవీఎల్ అంతే పద్దతిగా సూటిగా సుత్తి లేకుండా… సమాధానం చెప్పారు. ఏమని.. అంటే.. తాము కేసులు పెట్టడానికి.. అవసరమైన పత్రాలు ఏపీ ప్రభుత్వం ఇవ్వడం లేదట.
ఆర్టీఐ చట్టం ప్రకారం అడిగినా ఇవ్వడం లేదట. సరే ఆర్టీఐకి ధరఖాస్తు చేస్తే.. ఏ వివరాలైనా వస్తాయన్నది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని పక్కన పెట్టేసినా… జీవీఎల్ ఆన్సర్ చూస్తే తెలిసేదేమిటంటే.. తమ చేతికి ఆ పత్రాలు వస్తేనే.. కేసులు పెట్టగలుగుతారట. అంటే.. జీవీఎల్ అవినీతి జరిగిందని ఊహించుకుని చెబుతున్నట్లే కదా..! ఆయనదగ్గర రూఢీగా ఏ సమాధానం లేనట్లే కదా..!. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ… టీడీపీ వాళ్లు దోచుకున్నారని..అనుమానించారు కాబట్టి.. వాళ్ల ఇళ్లలో సోదాలు చేస్తే… ఏవో దొరికిపోతాయని.. ఐటీ, ఈడీలను ఎగదోస్తే… ఆధారాలు దొరికిపోతాయా..?.