బిజెపి రాష్ట్ర అద్యక్షుడు ఎంపి కంభంపాటి హరిబాబు ఉమ్మడి గవర్నర్ అవసరం లేదని చెప్పడం వ్యక్తిగత అభిప్రాయం కాదట. బిజెపి కేంద్రంలోనూ రాష్ఠ్రంలోనూ అలాగే భావిస్తున్నదని ముఖ్య నాయకుడు ఒకరు చెప్పారు. బిజెపి ఎల్పి నాయకుడు విష్ణు కుమార్ రాజు తను ప్రతిపాదించిన నాలాబిల్లు ఆమోదించనందుకు ఆగ్రహించడం వ్యక్తిగతం. అలాగే హరిబాబు కూడా మొదటి నుంచి ఈ విషయమై ఉమ్మడదది గవర్నర్ వద్దనే అంటున్నారు. ఇప్పుడు కొత్తగా నియామకాలు జరుగుతాయి గనక లేఖ రాశారు. ఇది కేంద్రం పునరాలోచించడానికి వీలవుతుంది అని ఆ నాయకుడు తెలిపారు. బిజెపి క్రమశిక్షణ గల జాతీయ పార్టీ గనక అధికార ముద్ర లేకుండా అద్యక్షుడు లేఖ రాయరన్నది ఆయన అంటున్నమాట. హైదరాబాదుతో మన ప్రజలకు ఏం సంబంధం? చంద్రబాబు తన వ్యాపారాలు రాజకీయాల కోసం వుంటే వుండొచ్చు గాని మామూలు ప్రజలకు ఏం పని వుంది అని హరిబాబు చాలా సార్లు వాదిస్తూ వచ్చారు. అయితే అనేక సమస్యలు అపరిష్క్రతంగా వున్నప్పుడు ఇరు ముఖ్యమంత్రులతో మాట్టాడే గవర్నర్ అవసరమనుకున్నాం గాని అదే ప్రతికూలంగా మారిందని ఎపిబిజెపి నేతలంటున్నారు. నరసింహన్ కెసిఆర్‌కు ఎక్కువ చెవి వొగ్గుతున్నారనేది వారి ఆరోపణ కూడా.