హైదరాబాద్ శివార్లు అంటే.. గ్రేటర్ , హెచ్ఎండీఏ పరిధి కూడా దాటిన తర్వాత కూడా రియల్ ఎస్టేట్ కు మంచి స్కోప్ ఉంది. అయితే ఏదో ఓ ఆకర్షణ శక్తి ఆ వైపు ఉండాలి. అలాంటి ఆకర్షణ శక్తి ఉన్న ప్రాంతం యాదరిగి గుట్ట. యాదగిరి గుట్టకు సమీపంలో వెళ్లే దారిలో ఎన్నో వెంచర్లు వెలిశాయి. నిజానికి తెలంగాణ ఏర్పడక ముందు కూడా అక్కడ స్థలాలు , పొలాలకు డిమాండ్ ఉంది. కేసీఆర్ ఆలయాని అభివృద్ది చేసిన తర్వాత మరింత పెరిగింది.
అయితే అక్కడ అంతకు ముందు జరిగిన వ్యాపారం, స్థలాల అమ్మకాలు కొనుగోలుకు చట్టబద్ధత లేదు. అనుమతులు ఉన్న వెంచర్లు తక్కువ. కానీ ఇప్పుడు అన్ని రకాల అనుమతులతో వెంచర్లు వేసి అమ్ముతున్నారు. కానీ రేట్లు చాలా ఎక్కువ. వచ్చే పదేళ్లకు అయినా పెట్టుబడికి తగిన రిటర్న్ ఉంటుందా లేదా అన్న సందేహం ఉంది. యాదాద్రితో పాటు పాటు ఆలేరు వైపు పది కిలోమీటర్ల దూరంలో కూడా వెంచర్లు వేసి వీకెండ్ హోమ్స్ పేరుతో అమ్ముతున్నారు. వాటిని కొనడమే కానీ మళ్లీ అమ్ముకోవడం అసాధ్యమని ఎక్కువ మంది చెబుతున్నారు. భవిష్యత్ కోసం పెట్టే పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో మొదటిది పెట్టుబడి సురక్షితం కావడం.. రిటర్నులు.
యాదాద్రిలో అన్ని అనుమతులు ఉన్న టౌన్ షిప్పుల్లో దీర్ఘకాల పెట్టుబడి వ్యూహంతో స్థలం కొనుగోలు చేస్తే.. మంచిది కానీ.. తక్కువకు వస్తున్నాయని పెద్దగా అనుమతులు లేని వాటి జోలికి వెళ్లాల్సిన పని లేదని ఎక్కువ మంది సలహా ఇస్తున్నారు. ప్రస్తుతానికి యాదాద్రిలో ఇళ్ల స్థలాలు అమ్ముతున్నారు కానీ.. కొత్తగా వచ్చే కాలనీలు లేవు. ఇళ్లు కట్టడం చాలా తక్కువ. ఈ అయితే భవిష్యత్ లో వరంగల్ వైపు హైదరాబాద్ నగరం విస్తరిస్తే మాత్రం జాక్ పాట్ కొట్టినట్లే అనుకోవచ్చు.
ఇప్పటికి అయితే.. హైదరాబాద్ నగరం వరంగల్ వైపు విస్తరిస్తున్న వేగం అంత ఎక్కువగా లేదు. అందుకే. వచ్చే పదేళ్ల తర్వాత అక్కడి స్థలాలకు ఎంత రేటు ఉంటుందో అంచనా వేసుకుని అంతకు సగం రేటుకు ప్లాట్లు కొనుగోలు చేస్తే వర్కవుట్ అవుతుంది. అంత కంటే ఎక్కువ పెడితే పెట్టుబడి తిరిగి రప్పించుకోవడం కోసమే కష్టపడాల్సి రావచ్చు.