జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటం బాధితులకు ప్రకటించిన రూ. లక్ష సాయాన్ని యాభై మూడు కుటుంబాలకు శనివారం ఇవ్వాలని నిర్ణయించారు. జనసేన సభకు పొలాలు ఇచ్చారన్న కారణంగా.. మొత్తం 53 ఇళ్లు కూల్చేశారని పవన్ ఆరోపిస్తున్నారు. అందుకే ఆ యాభై మూడు కుటుంబాలకు తలా ఓ లక్ష సాయం ప్రకటించారు. వారికి శనివారం చెక్కులు అందచేయాలని నిర్ణయంచారు. ఈ కార్యక్రమానికి పవన్ హాజరయ్యే అవకాశం ఉంది. ఆయన రాలేకపోతే నాదెండ్ల మనోహర్ ఇస్తారు.
ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది.. అదేమిటంటే.. తమ ఇళ్లను ప్రభుత్వం కూల్చలేదని.. మాకు పవన్ ఇచ్చే సాయం వద్దని అన్ని ఇళ్ల ముందు గతంలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇవన్నీ ఆ ఇళ్ల యజమానులే వేశారని.. పవన్ రాజకీయం చేస్తున్నారని వైసీపీవర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ వారందరికీ తలా లక్ష చెక్కు పంపిణీకి రంగం సిద్ధం చేశారు. మరి వారంతా హాజరవుతారా లేకపోతే.. ప్రభుత్వం చెప్పింది నిజమని చెప్పి.. పవన్ సాయం తమకు వద్దని రిజెక్ట్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
పవన్ కల్యాణ్ సాయం తీసుకోవద్దని ప్రభుత్వం తీవ్రంగా ఒత్తిడి చేయడం ఖాయం. అయితే ఈ విషయంలో బాధితులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇళ్లు కూలగొడితే ఎవరూ సంతోషపడరు. ఎందుకంటే ఇప్పటంలో భూసేకరణ చేసి ఇళ్లు కూలగొట్టలేదు. ప్రభుత్వ స్థలమని చెప్పి.. కూలగొట్టారు. అందుకే.. కష్టపడి నిర్మించుకున్న ఇళ్లు కూలిపోయాయని వారు ఆందోళన చెందడం సహజం. కానీ వారికి ప్రభుత్వ భయమేనేది ఉంటుందని.. పవన్ దగ్గరకు వెళ్లకుండా కట్టడి చేస్తుదని.. వెళ్తే కేసులు పెట్టి వేధిస్తారేమోనని వారు భయపడుతూంటారు.
పవన్ కల్యాణ్ .. ఆ ఇళ్ల ముదు పెట్టిన ఫ్లెక్సీలు తప్పని.. అది ప్రభుత్వ ఫ్యాక్షన్ మనస్థత్వానికి నిదర్శనమని నిరూపించే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. మరి ఇప్పటం ప్రజలు ఎలా స్పందిస్తారో ?