ఇల్లు కొనుగోలుకు నిధులు రెడీ చేసుకున్న వారికి ఓ పెద్ద సమస్య వెంటాడుతూ ఉంటుంది. అదేమిటంటే… రెడీగా ఉన్న ఇల్లు కొనుగోలు చేయాలా లేకపోతే నిర్మాణంలో ఉన్న ఇల్లు కొనుగోలు చేయాలా అన్నది. రెడీగా ఉంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకుని .. అభిరుచికి తగ్గట్లుగా ఇంటీరియర్ చేయించుకుని ఇంట్లో చేరిపోవచ్చు. అదే నిర్మాణంలో ఉంటే పూర్తయ్యే వరకూ ఎదురు చూస్తూ ఉండాలి. అంటే బిల్డర్ దాయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉండాలి.
సొంత ఇంట్లో ఉండాలనుకునేవారి చాయిస్ రెడీ టు మూవ్ ఇళ్లు
చాలా మంది మధ్య.తరగతి ప్రజల మనస్థత్వం తాము డబ్బు కట్టిన వెంటనే వస్తువు చేతికి రావాలనుకుంటారు. ఎందుకంటే వారి రూపాయికి ఉన్న విలువ వేరు. ఓ సారి కోల్పోతే మళ్లీ సంపాదించుకోవడానికి జీవితం సరిపోదు. అందుకే రెడీగా ఉన్న ఇళ్లను చూసి కొనుగోలు చేసుకుంటే మోసాల నుంచి బయటపడవచ్చని అనుకుంటారు. అందుకే ఓ రూపాయి ఎక్కువ అయినా వాటికే ప్రాధాన్యం ఇస్తూంటారు. అదే సమయంలో నిర్మాణం పూర్తయిన వాటికి జీఎస్టీ కట్టాల్సిన అవసరం ఉండదు. బిల్డర్ చెప్పే రేటులోనే ఆ బిల్లు కూడా వేసేస్తాడు.
పెట్టుబడి కోసం ఇళ్లు కొనేవారే చాయిస్ నిర్మాణంలోనివి !
అయితే ఎక్కువ మంది ఎగువ మధ్యతరగతి ప్రజలు నిర్మాణంలో ఉన్న ఇళ్లను బుక్ చేసుకుటూ ఉంటారు. వీరు ఆ ఇళ్లల్లో ఉంటారా లేదా అన్నదాని కన్నా.. పెట్టుబడి రూపంలో ఈ బుకింగ్స్ చేస్తూంటారు. దీని వల్ల కొన్ని మైనస్లు ఉంటాయి. కొంత మంది బిల్డర్లు సరైన సమయానికి పూర్తి చేసి హ్యాండోవర్ చేయకుండా ఇబ్బంది పెడుతూంటారు. ఈ రిస్కులన్నీ వీరు భరించాల్సి ఉంటుంది. పేరున్న సంస్థలతే నమ్మకం ఉంటుంది. లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ధర తక్కువ అనే ప్రీలాంచ్ ఆఫర్లపై మొగ్గు
చాలా మంది మధ్యతరగతిప్రజలు లగ్జీర మోజులోపడి ఇవాళ కాకపోతే రెండేళ్లకైనా మంచి లగ్జరీ ఇల్లు వస్తుంది కదా అని ప్రీ లాంచ్ ఆఫర్ల మాయలో పడుతున్నారు. ఈ ప్రిలాంచ్ ఆఫర్లు ఎన్ని మెటీరియలైజ్ అవుతున్నాయో కానీ మోసపోయేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. బడా సంస్థలన్న పేరు.. గత ప్రాజెక్టుల పేరుతో వారు చేసే మయా ప్రచారం కారణంగా ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. అందుకే అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.