చినజీయర్ స్వామికి ప్రస్తుతం టైం కలసి రావడం లేదు. సమతామూర్తి విగ్రహావిష్కరణ వరకూ ఆయన ప్రభ దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఎప్పుడేతే శిలాఫలకంపై కేసీఆర్ పేరు లేకుండా సమతా మూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీతో ఆవిష్కరింపచేశారో అప్పట్నుంచి ఆయనకు శని దశ ప్రారంభమయినట్లుగా కనిపిస్తోంది. వరుస వివాదాలు చుట్టు ముడుతున్నాయి. పాలకులు కన్నెత్తి కూడాచూడటం లేదు. పాలకులే చూడటం లేదంటే.. ఇక ప్రభుత్వ అధికారులు చూసే అవకాశం లేదు. ఇక పాత వీడియోలను బయటకు తీసి ఆయనను బద్నాం చేసే కార్యక్రమం జోరుగా సాగుతోంది.
ఎలాంటి మీడియా విస్తృతి.. సోషల్ మీడియా లేనప్పుడు ఆయన చాలా చాలా ప్రసంగాలు చేశారు. ఆయన ప్రవచనాల పేరుతో ఎన్నో వివాదాంశాలు మాట్లాడారు. అప్పట్లో ఆయనకు ఉండేఇమేజ్ కాబట్టి అందరూ సర్దుకుపోయారు. కానీ ఇప్పుడు వాటినే బయటకు తీసి ఆయనను డబ్బుల స్వామిగా మార్చేస్తున్నారు. చివరికి పరిపూర్ణానంద కూడా చినజీయర్ సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తన ప్రమేయం లేకుండానే.. యాదాద్రి ఆలయ మహా సంప్రోక్షణ నిర్వహిస్తోంది.
ఆయనకుకనీసం ఆహ్వానం లేదు. ఇటీవల యాదాద్రి నుంచికొంత మంది అర్చకుల్నిపిలిపించుకున్న చినజీయర్ త్వరలో తాను వస్తానని తన చేతుల మీదుగానే కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. కానీ అలాంటి వాటికి అవకాశం లేదని తేలిపోయింది. ఇప్పుడు కొత్తగా వివాదాలు చుట్టు ముడుతున్నాయి. ఇప్పటికే ఆయన విపక్ష నేతలకు టార్గెట్ అయ్యారు. ముందు ముందు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ముచ్చింతల్లో రాను రాను ఎక్కువ అవుతోంది.