హైదరాబాద్: ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నిరసనలు జరుపుతున్న విద్యార్థుల వెనక లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్ ఉన్నాడని, హఫీజ్ చేసిన ట్వీట్లే దీనికి నిదర్శనమని కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిన్న వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజ్‌నాథ్ పేర్కొన్న హఫీజ్ ట్విట్టర్ ఎకౌంట్ ఫేక్‌దని తేలింది. దీనితో హఫీజ్ సయీద్ రెచ్చిపోయాడు. భారత ప్రభుత్వం తమ సొంత ప్రజలనే ఎలా మోసం చేస్తుందో తెలపటానికి ఇదే నిదర్శనమని ట్విట్టర్లో వ్యాఖ్యానించాడు. దీనిపై వరసగా కొన్న ట్వీట్లు చేశాడు. కాశ్మీర్ యువత ఎవరి ఆదేశాల మేరకూ నడుచుకోవటంలేదని అన్నాడు. వారు ఎదుర్కొంటున్న అణచివేత, అరాచకాలే వారితో అలా చేయిస్తున్నాయని వ్యాఖ్యానించాడు. భారతదేశం పాకిస్తాన్‌పై చేస్తున్న ఆరోపణలన్నీ ద్వేషం, శత్రుత్వంతో కూడుకున్నవేనని ఆరోపించాడు. ముంబాయిలో జరిగిన 26/11 తీవ్రవాద దాడుల విషయంలో కూడా భారత ప్రభుత్వం తన ప్రజలను అలాగే తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొన్నాడు.
https://twitter.com/HafizSaeedLive?ref_src=twsrc%5Etfw