సెలబ్రిటీలు వాళ్ల అభిప్రాయం చెప్పడం కూడా తప్పేనా..!?

అంతర్జాతీయ సెలబ్రిటీలు భారత రైతులకు మద్దతు ప్రకటించారు. వారిపై దేశంలోని కొంత మంది విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బీజేపీని అభిమానించేవారు .. దేశ అంతర్గత విషయాల్లో బయట సెలబ్రిటీల జోక్యం ఏమిటంటూ మండిపడ్డారు. అలా మండిపడిన వారిలో ఇండియన్ సినిమా, స్పోర్ట్స్ సెలబ్రిటీలు ఉన్నారు. అయితే వీరిపై స్వదేశంలోనే కొంత మంది విరుచుకుపడ్డారు. రైతులు కష్టాలు పడుతూంటే స్పందించలేదని… రైతుల ఉద్యమంపై స్పందించలేదని… దేశంలో ఎన్నో సార్లు విపత్తులు సంభవించినాస్పందించలేదని కానీ ఇప్పుడు మాత్రం.. రైతుల్ని కించ పరిచేందుకు వస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ రెండు వర్గాలను చూస్తూంటే దేశంలో తమ అభిప్రాయమే నెగ్గాలనే వాదనను బలంగా రెండు వర్గాలు వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

సచిన్, అక్షయ్ వారి అభిప్రాయం చెప్పారు..! తప్పు ఎలా అవుతుంది..?

దేశంలో అందరికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. అందరికీ అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉంది. ఎవరి అభిప్రాయం వారిది. పక్కన ఉన్నవాడు.. తన అభిప్రాయంతో ఇతరులు ఏకీభవించాలని కోరుకోవడం అత్యాశ.. అమాయకత్వం. అలా ఏకీభవించాలని ఒత్తిడి చేయడం తప్పు. అందరి ఆలోచనా సామర్థ్యం ఒకలా ఉండదు. ఎవరి ఆలోచనలకు తగ్గట్లుగా మంచేదో.. చెడో వారు నిర్ణయించుకుంటారు. వారి అభిప్రాయం చెబుతారు. ఆ అభిప్రాయంతో అందరూ ఏకీభవించాలని లేదు. ఖండించేవారు ఉంటారు. కానీ ఆ ఖండన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. భారత్ లాంటి సున్నితమైన ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అంతర్జాతీయ సెలబ్రిటీల ట్వీట్లను ఖండిస్తే.. దేశంలో రైతులకు అన్యాయం చేసినట్లుగా ఎలా అవుతుందో సదరు సలెబ్రిటీల్ని విమర్శించేవారే వివరించాల్సి ఉంది.

అందరూ ఒకే వైపే ఉండాలని ఎలా అనుకుంటారు..?

క్రీడా, రాజకీయమే కాదు.. వివిధ రంగాల సెలబ్రిటీలు తమ తమ రంగాల్లో నిష్ణాతులు. వారేమీ రాజకీయ నేతలు కాదు. వారు కూడా సామాన్య ప్రజలే. వారికి అధికారం అంటే భయం .. భక్తి ఉంటాయి. అలాగే కొంత మందికి స్వతంత్ర భావాలు ఉంటాయి. ఎవరి ఆలోచనలకు తగ్గట్లుగా వారు ఉంటారు. సచిన్ టెండూల్కర్ అయినా.. అక్షయ్ కుమార్ అయినా… ట్వీట్లు చేశారంటే.. వారి కారణాలు వారికి ఉంటాయి. అంత మాత్రాన వారికి దేశం ఏదో ఇచ్చిందని.. ఆయన మాత్రం అన్యాయం చేస్తున్నాడని వాదించడం కరెక్ట్ కాదు. ఆయనకు దేశం ఏమీ ఇవ్వలేదు. ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు. ఎవరైనా దేశ ప్రజలు ఏమైనా ఇచ్చారు అంటే.. అది అబద్దమే. ఈ దేశంలో ఎవరూ ఎవరికీ అప్పనంగా ఏదీ ఇవ్వరు. అందరూ కష్టపడి సంపాదించుకున్నవారే. కొంత మందికి అది అదృష్టంతో వచ్చి ఉండవచ్చు..కానీ అది కూడా కష్టపడుతూ పోతేనే ఎక్కడో ఓ చోట తగులుతుంది.

అంతర్జాతీయ సెలబ్రిటీల ట్వీట్లు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఎలా అవుతుంది..?

ఇక అంతర్జాతీయ సెలబ్రిటీలు భారతీయ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటూ ట్వీట్లు చేశారు. వారిని విమర్శించేవారిది కూడా తప్పే. రైతులు మూడు నెలలుగా ఢిల్లీ శివార్లలో కదలకుండా ఉద్యమం చేస్తున్నారంటే ఖచ్చితంగా అది అంతర్జాతీయ అంశమే. దీన్ని ఆ స్థాయికి వెళ్లకుండా చేయడంలో కేంద్రం విఫలమయింది. అందుకే వయసులో చిన్న వాళ్లయినా… పెద్ద పెద్ద ఆలోచనలతో ప్రపంచంలోని సమస్యలపై స్పందిస్తున్నారు. వారిని గౌరవించాలి కానీ కించ పర్చకూడదు. ప్రపంచంలో భారత్ కు ఉన్న ఇమేజ్‌ను మార్చేందుకు ప్రయత్నించాలి కానీ చెడగొట్టకూడదు.

భారత్ ఇమేజ్‌ను పెంచాలి.. తగ్గించకూడదు..!

ఇప్పటికీ భారత్‌కు అంతర్జాతీయ వేదికల మీద ఏదైనా సినిమాల్లో అవార్డులు వచ్చాయంటే.. అతి దేశంలో అభివృద్ధి.. అభ్యుదయాన్ని చూపించేసినిమాల వల్ల కాదు. పేదరికం.. అవినీతి… ఇతర రుగ్మతలను చూపిస్తూ తీస్తున్న సినిమాలకే అవార్డులొస్తున్నాయి. అంటే ఇండియా స్థాయిని అంతర్జాతీయంగా అక్కడే అంచనా వేస్తున్నారు. అలా కాకుండా… దేశానికి ఓ గుర్తింపు తీసుకు రావాలంటే.. ట్విట్టర్ల మీద కేసులు.. ట్వీట్ల మీద ఎఫ్‌ఐఆర్‌లు పెట్టుకుంటే సాధ్యం కాదు. మనిషి ఆలోచనా పరిధి పెంచుకోవాలి.. ముఖ్యంగా పాలకులు కూడా పెంచుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close