ఘోర పరాజయం తర్వాత రాజకీయ రంగస్థలం మీద నిలదొక్కుకునేందుకు ఓదార్పు యాత్ర ఒక్కటే పరిష్కారంగా భావిస్తోంది వైసీపీ. గతంలో ఓదార్పు యాత్రే పార్టీకి మైలేజ్ తెచ్చిందని.. దాంతో ఇప్పుడూ అదే దారిలో వెళ్తే రిజల్ట్ ఉంటుందని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు జనాల్లోకి వెళ్తే వైసీపీకి ఆదరణ కాదు కదా..జగన్ ను అడ్డుకునే పరిస్థితులు ఉన్నాయి. దాంతో డిసెంబర్ నుంచి ఓదార్పు యాత్ర చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
అయితే, గతంలో తిరుగులేని హైప్ తెచ్చిన ఓదార్పు యాత్రతో వైసీపీకి మునుపటి తరహాలో ఆదరణ లభ్యం అవుతుందా..? అంటే కష్టమే. జగన్ గతంలో ఓదార్పు యాత్ర చేపట్టినప్పుడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు వేరు. అయినప్పటికీ అప్పట్లో వైసీపీ బలోపేతానికి పని చేసిన అస్త్రమే ఇప్పుడు పార్టీకి సంజీవనిలా ఉపయోగపడుతుందని భావించడం అవగాహనారాహిత్యమే.
వైఎస్ పైనున్న ఆదరణ వలన ఓదార్పు యాత్ర నాడు సక్సెస్ అయింది. ఆ తర్వాత ఒక్క అవకాశం ఇవ్వండి..రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పిన జగన్ కు ప్రజలు అవకాశమిస్తే కాళ్ళదన్నుకున్నారు. ఐదేళ్ళు ఏపీని అరచాకాంధ్ర ప్రదేశ్ గా మార్చారు. దాంతో విసిగిన ప్రజలు చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి తిరుగులేని విజయాన్ని అందించి వైసీపీని ఛీ కొట్టారు. 150సీట్ల నుంచి 11సీట్లకు పరిమితం చేశారు.
ఈ సమయంలో ఏం చేస్తే బాగుంటుందని సమాలోచనలు జరిపిన జగన్.. ఓదార్పు యాత్ర ఓ అస్త్రమని అనుకుంటున్నారు. ఆ ఓదార్పు యాత్రే మళ్ళీ రాజకీయ రంగ స్థలంపై వైసీపీని స్ట్రాంగ్ గా నిలబెడుతుందని నమ్ముతున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఓదార్పు యాత్ర అని అంటున్నా జగన్.. కడుపు నొప్పికి జ్వరం ట్యాబ్లెట్ వేస్తే ఏం ప్రయోజనం..?కానీ, జగన్ అదే చేస్తున్నారు.