తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… “రైతు బంధు” పథకాన్ని పెట్టుబడిగా వాడుకుని జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్సేతర, బీజేపీయేతర అంటూ హడావుడి చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ మోడల్స్ ఫెయిలయ్యాయని.. దేశానికి కొత్త మోడల్ కావాల్సిదేనని హడావుడి చేస్తున్నారు. దానికి జనతా మోడల్ బాగుంటుందన్నట్లుగా చెప్పుకొస్తున్నారు. మరి జనతా మోడల్లో ఇతర రాష్ట్రాల నుంచి కూడా నేతలు కలసి రావాలి కదా..! వాళ్లెవరు..?
దేశ రాజకీయాలను మార్చే క్రమంలో ఏపీకి కూడా వెళ్తా.. ! విజయవాడలో సమావేశం పెడతా. చంద్రబాబు గురించి చెబుతా..! అని కేసీఆర్ చెబుతున్నారు. విజయవాడలో సమావేశం పెట్టి దేశ రాజకీయాల గురించి ఎలా మారుస్తారు..? టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పటికే.. బీజేపీయేతర కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వెళ్తే కేసీఆర్ ఆయన వెంట వెళ్లాలి కానీ… చంద్రబాబును తన వెంట రావాలని అడిగే ధైర్యం చేయలేరు. ఇక దేశ రాజకీయాలతో పాటు.. ఏపీలో రాజకీయాలను కూడా మారుస్తామంటున్నారు కాబట్టి.. తన జనతా మోడల్లో ఏపీలో.. ఆయనకు భాగస్వామ్యపక్షాలుగా ఉండే అవకాశం వైసీపీ, జనసేనలకు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు… టీఆర్ఎస్కు సహకరించాయి. ఏపీలో టీఆర్ఎస్ సహకారాన్ని వద్దనుకునే పరిస్థితి లేదు.
అందుకే కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమిలో… కేసీఆర్ , అసదుద్దీన్లతో పాటు… జగన్, పవన్ లు కూడా కీలకం కాబోతున్నారు. ఏదో జాతీయ కూటమిలో భాగంగా లేకపోతే… ప్రజలు నమ్మరని జగన్ కూడా.. భావిస్తున్నట్లు… ఆయన మీడియాలో ఇప్పటికే ఫీలర్స్ పంపుతున్నారు. అదే జరిగితే.. కేసీఆర్ జనతా మోడల్ దేశ రాజకీయాల్లో ఏపీ నుంచి జగన్, పవన్ భాగస్వాములవుతారు.. మరి ఇద్దరూ రాజకీయంగా మగతనాలపై చర్చించుకుంటున్నారు కదా..? వాళ్లు ఎపీలో కలుస్తారా..? అంటే… అదంత వీజీ కాదనే చెప్పుకోవాలి…!