సీఎం జగన్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితో రాజీనామా చేయించాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో ప్రాధాన్యం దక్కలేదు. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు కూడా ఇవ్వరు. గత ప్రభుత్వం పెట్టిన కార్పొరేషన్ పేరుతో పథకాలు నిధులు చూపించి ఉపాధి ఎగ్గొట్టి ఆ సామాజికవర్గ యువతకూ అన్యాయం చేస్తున్నారు. అయినా ఎవరూ మాట్లాడలేదు. పైగా సీఎం జగన్ నిర్ణయాలను సమర్థిస్తున్నారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవి కూడా తీసేయాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఆ పదవిని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామికి ఇవ్వనున్నారు. ఆయన సామాజికవర్గానికి పదవుల్లో మొండి చేయి చూపారు. అయితే ఇప్పుడు ఆ రెండు సామాజికవర్గాల మధ్య చిచ్చు పెడితే.. ఓటు బ్యాంక్ సగం ఖచ్చితంగా తమ వైపు ఉంటుందన్న ఉద్దేశంతో ఇలా ఒకరికి పీకేసి మరొకరికి పదవి ఇస్తున్నట్లుగా భావిస్తున్నారు. వైసీపీలో కుల రాజకీయం.. ఓ రేంజ్లో నడుస్తోంది. ఇప్పటికే అధికారం ఉండే పదవులన్నీ ఒకే వర్గానికి దక్కాయని ఆరోపణలు వస్తున్నాయి.
నామమాత్రమైన పదవుల విషయంలోనూ కూడా ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టేలా నిర్ణయాలు తీసుకుని.. విభజించు.. పాలించు సూత్రాన్ని పాటిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కోన రఘుపతితో రాజీనామా చేయించి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం ప్రత్యేకంగా జూన్లో మూడురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.