వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి రాజస్థాన్ లో పదిహేడో తేదీన అంటే శనివారం జరగనుంది. ఇప్పటికే కుటుంబసభ్యులు రాజస్థాన్ చేరుకుని కొన్ని సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శనివారం రోజు పెళ్లికి సీఎం జగన్ వెళ్తున్నారా లేదా అన్నదానిపై ఎలాంటి సమాచారం లేదు. ఆయన షెడ్యూల్ కూడా అస్పష్టంగా ఉంది. రాజస్థాన్ టూర్ ఉంటే సీఎంవో ప్రకటన చేసి ఉండేది. షర్మిల కుమారుడి ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ లో జరిగితే ప్రత్యేక విమానంలో వచ్చి జగన్ హాజరయ్యారు.
అయితే అక్కడ ఎక్కువ సేపు ఉండలేదు. పది నిమిషాల్లో వెళ్లిపోయారు. ఆ ఎంగేజ్ మెంట్ తర్వాత షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుని విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ అన్నపై ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ సోషల్ మీడియా షర్మిలపై అసభ్య పోస్టులు పెట్టడం కూడా వివాదాస్పదమయింది. ఈ వివాదం పెరగడంతో సోదరి కుమారుడి పెళ్లికి వెళ్తారా లేదా అన్నది వైసీపీ వర్గాల్లోనూ సస్పెన్స్ గా మారింది. జగన్ రెడ్డికి మొదటి నుంచి రాజకీయం రాజకీయంగా.. చూసే అలవాటు లేదు. ఆయన రాజకీయ శత్రువుల్ని వ్యక్తిగత శత్రువులుగా చూస్తారు.
అందుకే రాజకీయంగా వ్యతిరేకమైన షర్మిల కుమారుడి పెళ్లికి ఆయన వెళ్లకపోవచ్చని అంటున్నారు. అలా వెళ్లకపోతే ఆయనపై సొంత కుటుంబంలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. చాలా మందికి మళ్లీ దగ్గర కాలేనంత దూరమవుతారు. అందుకే.. జగన్ రెడ్డి పెళ్లి సమయానికనా వెళ్తారని అంటున్నారు.