ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆయన చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధర్నా, అక్కడ జగన్ చేసిన వ్యాఖ్యలపై సూటిగా ప్రశ్నించారు.
జగన్… ఎందుకు మీకు సంఘీబావం ప్రకటించాలి? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా…? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా? ప్రత్యేక హోదాను గాలికి వదిలేసి, విభజన సమస్యలను పట్టించుకోనందుకా? అని ప్రశ్నించారు.
అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేసిన ఉద్యమాల్లో దేనికీ జగన్ పార్టీ సంఘీభావం ప్రకటించలేదు. మద్దతు తెలపలేదు. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేపడితే మీరు ఆనాడు మద్ధతు ప్రకటించారా అని షర్మిల ప్రకటించారు.
Also Read : జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?
మీ నిరసనలో నిజం లేదని తేలిపోయింది… అందుకే కాంగ్రెస్ పార్టీ మీ నిరసనకు దూరంగా ఉందని షర్మిల స్పష్టం చేశారు.
వినుకొండ ఘటనపై ఇప్పటికే షర్మిల స్పందిస్తూ, అందులో వ్యక్తిగత కక్షలు తప్పా రాజకీయ కక్షలు లేవని… ఇది తమ పార్టీతో పాటు మీడియా వ్యక్తులతో సమాచారం ధృవీకరించుకున్నామని ప్రకటించారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని వెల్లడిస్తూ జగన్ అంటూ తమ వైఖరి చెప్పకనే చెప్పారు. ఇండియా కూటమికి జగన్ దగ్గరవుతున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో షర్మిల స్పందన ఆసక్తికరంగా మారింది.