వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఒపెన్ ఛాలెంజ్ విసిరారు. జగన్ బూటకపు హామీల వీడియో పెట్టి చర్చకు సిద్దమా అని సవాల్ చేసారు. సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి….బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి….విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ ను కూల్చేసి….ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డి అని చంద్రబాబు ప్రశ్నించారు.
నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది…ఇంకా 50 రోజులే మిగిలి ఉననాయని స్పష్టం చేశారు. క్కలు ఊడిపోయిన ఫ్యాన్ ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుందన్నారు. బూటకపు ప్రసంగాలు కాదు…అభివృద్ది పాలన ఎవరిదో….విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం.. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా అని సవాల్ విసిరారు. ప్లేస్, టైం…నువ్వే చెప్పు. ఎక్కడికైనా వస్తా….దేనిమీదైనా చర్చిస్తా. నువ్వు సిద్ధమా జగన్ రెడ్డీ అని చంద్రబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోది.
పాలన పగ్గాల కోసం పోటీ పడుతున్న ఇద్దరు నాయకులు ప్రజల ముందు చర్చించడం ప్రజాస్వామ్యంలో అత్యున్నత సంప్రదాయం. చంద్రబాబు చాలెంజ్‌కు జగన్ రెడ్డి సై అంటే ప్రజాస్వామ్యంలో విలువలు పెంచేందుకు ఆయన సిద్ధమైనట్లే అనుకోవచ్చు.. చంద్రబాబు చాలెంజ్ పై జగన్ రెడ్డి ఏ విధంగా రియాక్టవుతారోనని రాజకీయవర్గాలతో పాటు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.