కేశినేని నాని పొలిటికల్ సూసైడ్ కు కారణం వైసీపీ అధినేత జగన్ రెడ్దేనా..? పొలిటికల్ ఫ్యూచర్ పై ఎంతో నమ్మకం పెట్టుకున్న నానికి వైసీపీ ప్రవేశమే భవిష్యత్ లేకుండా చేసిందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
టీడీపీలో క్రమశిక్షణ పాటించకుండా హద్దులు మీరి ప్రవర్తించిన నాని తన భవిష్యత్ ను తనే నాశనం చేసుకున్నారన్న వాదనలు ఓ వినిపిస్తుండగా… మరో వైపు ఆయన ఫ్యూచర్ పాలిటిక్స్ అంధకారంలోకి వెళ్లేందుకు జగన్ రెడ్డే కారణమని విమర్శలు వస్తున్నాయి.
ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలోకి వస్తుందని నమ్మకంతో ఆ పార్టీలో చేరి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాని ఆయన సోదరుడి చేతిలోనే ఓటమి పాలయ్యారు. వైసీపీ కూడా అధికారాన్ని కోల్పోవడంతో ఆయనకు పొలిటికల్ ఫ్యూచర్ పై ఆశలు సన్నగిల్లాయి. దీంతో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఎక్స్ వేదికగా సంచలన నిర్ణయం వెలువరించారు. వీటన్నింటికి జగన్ రెడ్డే కారణం అనే వాదనలు వినిపిస్తున్నాయి.
జగన్ నేతృత్వంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్ తో టీడీపీని వీడటమే ఆయన పాలిటిక్స్ పవర్ ను పంక్చర్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది. ఎన్నో అవకాశాలు కల్పించి రాజకీయ ఎదుగుదలకు సహకరించిన టీడీపీని అహంకారంతో వీడి ఘోర తప్పిదానికి పాల్పడిన నాని.. వైసీపీలో చేరడమే అతి పెద్ద తప్పిదమని..ఆయన రాజకీయానికి దారులు మూసుకుపోవడానికి జగన్ కూడా ఓ కారణమని నాని అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.