ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సర్కార్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదు. రెండు, మూడు నెలలకు ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఫిక్స్ అయింది. అధికారంలోకి వచ్చి కేవలం 45రోజులు మాత్రమే అవుతుండటంతో శాఖలపై పూర్తి పట్టు వచ్చేందుకు కొంత సమయం పడుతుందని అందుకే హడావిడిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టకూడదని నిర్ణయించింది.
దీనిపై పులివెందుల ఎమ్మెల్యే జగన్ స్పందిస్తూ..ఈ ఏడాది, అంటే 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్టెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతోందని ఎద్దేవా చేశారు. దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో 7 నెలలు ఓటాన్ అకౌంట్ మీదే నడుస్తోంది అంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందన్న విషయం అర్థమవుతుందని అన్నారు.
Also Read : అదేం తిక్క.. ఇదేం లెక్క.. జగన్?
నిజానికి, కూటమి సర్కార్ పూర్తి స్థాయి బడ్జెట్ పై వెనక్కి తగ్గడానికి కారణమే జగన్. ఆయన కొనసాగించిన ఆర్థిక విధ్వంసంతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఏ శాఖలను టచ్ చేసినా అప్పులే కనిపిస్తున్నాయి. ప్రభుత్వంలోని వివిధ శాఖలను చక్కదిద్దేందుకు ఇప్పటికే కూటమి సర్కార్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ఏయే శాఖల్లో ఎంత లోటు ఉంది..? ఎంత రెవెన్యూ ఉంది..? అని పూర్తి వివరాలు అందిన తర్వాతే బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. అసలు ఈ నిర్ణయానికి బాధ్యుడే జగన్.. అయినా ఈ విషయాన్ని మరిచి కూటమి సర్కార్ పై విమర్శలు చేయడం జగన్ నీతిమాలిన రాజకీయాలకు పరాకాష్ట అంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.