వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. జగన్మోహన్ రెడ్డి.. టీడీపీ ఎమ్మెల్యేలను.. పార్టీలో చేర్చుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించే అవకాశాలు కనిపించడం లేదు. దానికి కారణం .. వాళ్లు వస్తారో రారో.. అనే మీమాంస కాదు.. ఆహ్వానిస్తే గొంతెమ్మ కోరికలు కోరుతారనే .. సందేహమూ కాదు. అన్నిటికంటే ముఖ్యంగా.. టీడీపీకి వచ్చిన 23 సీట్లే… వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆందోళన కలిగిస్తోంది. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికల సందర్భంగా ఆయన మట్లాడిన మాటలు.. ఇదే విషయాన్ని మరో సారి రుజువు చేశాయి.
అసెంబ్లీలో స్పీకర్గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత.. అందరూ ఆయన గురించి నాలుగు మంచి మాటలు చెప్పడం సంప్రదాయం. సభా నాయకుడి హోదాలో… జగన్మోహన్ రెడ్డిఅలాగే.. ప్రసంగించారు. అయితే.. .ఆయన ప్రసంగంలో స్పీకర్ను ప్రశంసించడం కన్నా… ఇతర అంశాలే ఎక్కువగా ప్రస్తావనకు వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యేలను లాగేసుకుని.. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దామన్న ప్రతిపాదనను.. కొంత మంది నేతలు తన వద్దకు తెచ్చారని.. అప్పుడు.. ఆయనకు, తనకు తేడా ఏముంటుందని.. చెప్పానన్నారు. అంతే కాదు.. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను లాక్కుకున్నందుకే.. ఆ పార్టీకి 23 మంది మిగిలారన్నారు. తాము అలాంటి తప్పు చేయబోమన్నారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి వస్తేనే పార్టీలో చేర్చుకుంటామన్నారు.
పదే పదే జగన్మోహన్ రెడ్డి.. దేవుడు గురించి.. ఆయన రాసిన స్క్రిప్ట్ గురించి వర్ణిస్తూ.. టీడీపీ ఇరవై మూడు మంది ఎమ్మెల్ని లాక్కుంది కాబట్టి ఆ పార్టీకి 23మందే మిగిలారంటున్నారు. దేవుడ్ని అమితంగా విశ్వసించే జగన్మోహన్ రెడ్డి తీరును బట్టి చూస్తే.. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం దాదాపు చేయరని అర్థమైపోతుంది. ఎవరైనా .. పార్టీలో చేరుతామని వచ్చినా… దానికి సవాలక్ష నిబంధనలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఈ విశ్వాసం.. ఓ రకంగా.. టీడీపీకి మేలు చేసే అవకాశంలా కనిపిస్తోంది.
అయితే.. ఎవరినైనా తీసుకోవాలనుకుంటే… రాజీనామా చేసిన తర్వాతే తీసుకుంటామని.. జగన్మోహన్ రెడ్డి సభా వేదిక మీదే చెప్పారు. అంటే.. వలసలను… ప్రొత్సహించే అవకాశం లేదని.. తేల్చి చెప్పనట్లే. ఏదో మూల.. టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ కన్ను ఉందని చెప్పుకోవచ్చు. అయితే.. పార్టీలో చేరాలంటే.. రాజీనామాలు చేసి వెళ్లాలి. తప్పని సరిగా ఉపఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది అంత సులువు కాదు. అందుకే.. ఏపీలో ఫిరాయింపుల సమస్య పెద్దగా ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.