లైగర్ సెట్స్‌పై ఉండగానే విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్‌లు మరో సినిమా (జనగణమన) మొదలెట్టి ఓ కొత్త సంప్రదాయానికి తెర తీశారు. నిజంగా ఇది రిస్కీ స్టెప్పే. ‘లైగర్’ హిట్టయితే.. ‘జగనణమన’కు హైప్ మామూలుగా ఉండదు. అదే ఫ్లాప్ అయితే… అసలు ఆ సినిమాని పట్టించుకోనే కోరు. ఇప్నుడు ‘జనగనమన’కు అదే సమస్య ఎదురైంది. లైగర్ విడుదల అవ్వకుండానే ‘జనగణమణ’ అనే ప్రాజెక్టు ప్రకటించి, ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశాడు పూరి. ముంబైలో దాదాపు 12 రోజుల పాటు కొన్ని యాక్షన్ సీన్స్‌ని తెరకెక్కించారు. ఈ 12 రోజుల కోసం దాదాపుగా 7 కోట్లు ఖర్చయినట్టు టాక్. ఇప్పుడు `లైగర్` ఫ్లాప్ అయ్యింది. దాంతో ‘జనగణమన’పై నీలి నీడలు కమ్ముకొన్నాయి. ఈ సినిమాని ఆపేయడమే బెటర్ అని పూరి ఓ నిర్ణయానికి వచ్చాడట. దానికి కారణం ఉంది. ‘జనగణమన’కు భారీ బడ్జెట్ అవసరం. ‘లైగర్’ కంటే ఎక్కువ ఖర్చు పెట్టి తీయాల్సిన సినిమా అది. ‘లైగర్’ ఫ్లాప్ అవ్వడంతో ‘జనగణమన’కు క్రేజ్ తగ్గిపోయింది. కథపై ఎంత నమ్మకం ఉన్నా… ఇప్పుడు ఆ స్థాయిలో ఖర్చు పెట్టలేరు. సినిమా బాగున్నా – వసూళ్లు రావడం కష్టమే. సో.. ‘జనగణమన’ ప్రాజె్క్ట్ పక్కన పెట్టేయడమే బెటర్. ఈ విషయంలో పూరి – విజయ్ ఇద్దరూ కలుసుకొని, ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. త్వరలోనే దర్శక నిర్మాతలు, హీరో నుంచి ఓ ఉమ్మడి ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ‘లైగర్’ ఫ్లాప్ అయిన తరవాత.. పూరి ముంబై వెళ్లిపోయాడు. అక్కడ కొత్తగా ఓ స్క్రిప్టు రాసుకుంటున్నాడట. పూరి దృష్టి ‘జనగణమన’పై లేదని, ఆయన ఓ కొత్త కథ రాసుకుంటున్నాడని, త్వరలోనే ఆ సినిమా వివరాల్ని పూరినే ప్రకటిస్తాడని తెలుస్తోంది.