గత రెండు రోజులుగా సాక్షి పత్రిక ,సాక్షి టీవీ ఛానల్ జనసేన టీడీపీ కుమ్మక్కయ్యాయని విపరీతంగా కథనాలు రాస్తూ వస్తున్నారు. గాజువాక నియోజకవర్గం లో పల్లా శ్రీనివాసరావు ని తప్పించి చంద్రబాబు వేరే డమ్మీ అభ్యర్థి ని పవన్ కళ్యాణ్ మీద నిలబెట్ట బోతున్నాడని, తెనాలిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలపాటి రాజాను తప్పించి డమ్మీ అభ్యర్థి ని నాదెండ్ల మనోహర్ కోసం చంద్రబాబు పెట్టబోతున్నాడని, విశాఖపట్నం ఎంపీ సీట్ జెడి లక్ష్మీనారాయణ కోసం లోకేష్ తోడల్లుడు భరత్ కు సీటు ఇవ్వకుండా చంద్రబాబు వేరే వాళ్లకు పోటీకి పెట్టబోతున్నాడని సాక్షి 2 రోజులపాటు తెగ వార్తలు రాసింది. అయితే అవన్నీ ఒక ఇరవై నాలుగు గంటల్లోనే అసత్య కథనాలు అని తేలిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలపాటి రాజా కి , అలాగే కే టికెట్లు కన్ఫర్మ్ చేశాడు చంద్రబాబు.
అయితే సాక్షి మాత్రం మంగళగిరి అసెంబ్లీ స్థానాన్ని లోకేష్ కోసమే జనసేన కమ్యూనిస్టుల ని పోటీకి నిలబెట్టిందని, ఈ రకంగా చూస్తే టీడీపీ జనసేన ల మధ్య అవగాహన ఉందని మనం చెప్పుకోవచ్చు అని రాసుకుంటూ వచ్చింది. అయితే 2009 ఎన్నికలలో కమ్యూనిస్టులకు ఇక్కడ 30 శాతం దాకా ఓట్లు పోల్ అయిన విషయాన్ని కన్వీనియంట్ గా దాచి పెట్టింది సాక్షి.
అయితే ఇప్పుడు ఇదే సాక్షి లాజిక్ ప్రకారం చూస్తే జనసేన తో జగన్ కూడా కుమ్మక్కయ్యాయని అనుకోవాల్సి వస్తుంది. జనసేన పార్టీ పొత్తులో భాగంగా నగరి స్థానాన్ని బిఎస్పికి కేటాయించింది. మరి ఇదే సాక్షి లాజిక్ ప్రకారం చూస్తే జగన్ కూడా జనసేన తో కుమ్మక్కై, రోజా పోటీ చేస్తున్న నగరి స్థానంలో జనసేన అభ్యర్థిని నిలబెట్టకుండా బీ.ఎస్.పి కి టికెట్ ఇప్పించేలా చేశాడు అనుకోవాల్సి వస్తుంది. అయితే ఈ ఆరోపణలు ఇంకా ఎవరూ చేయలేదు. ప్రతి అంశంలోనూ రాజకీయం చేయడంలో, పక్క పార్టీల మీద బురద చల్లడం లో సాక్షీ ఛానల్ స్థాయిలో లో ఎవరు పని చేయ లేరేమో. ఒకవేళ ఇదే రోజా కనక టిడిపి అభ్యర్థి అయి ఉంటే, ఈపాటికే సాక్షిలో జనసేన టిడిపి కుమ్మక్కు కు మరో నిదర్శనం అంటూ మరొక పెద్ద కథనం వచ్చి ఉండేది.