జనసేనలో కీలక పొజిషన్లలో పాత్రధారులు తరచూ మారిపోతున్నారు. మొదట్లో మారిశెట్టి రాఘవయ్య ఉండేవారు. మొత్తం వ్యవహారాలను ఆయన ఒంటి చేత్తో నడిపేవారు. ఆ తర్వాత పార్టీలోకి కొంత మంది వ్యక్తులు వచ్చిన.. తర్వాత.. ఆయన అవసరం.. పవన్ కల్యాణ్‌కు పెద్దగా కనిపించలేదు. ఓ శుభముహుర్తంలో.. తనకు సహజసిద్ధంగా ఉన్న ఫైర్‌ను చూపించడంతో.. ఆయన ఆవేదనకు గురై.. ఇంటి పట్టునే ఉండి.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారని… జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు.. కొత్తగా… ఆ మారిశెట్టి రాఘవయ్యను.. ఎక్స్ట్రా క్యారెక్టర్‌ను చేసేసిన.. రెండు కీలక పాత్రలు.. మాదాసు గంగాధరం, తోట చంద్రశేఖర్లకు కూడా.. అదే ట్రీట్మెంట్ వస్తోంది.
జనసేన పార్టీని ఇప్పుడు.. రెండు రకాలుగా చెబుతున్నారు. ఒకటి నాదెండ్ల మనోహర్ పార్టీలో చేరిన తర్వాత.. చేరక ముందు .. అన్నట్లుగా జనసేన నేతలు.. ఇప్పటికే పార్టీ చరిత్రను విభజించుకుంటున్నారు. గతంలో.. జనసేన తరపున మీటింగులంటే.. వేదిక మీద ఒక్క కుర్చీ మాత్రమే ఉండేది. ఇప్పుడు రెండు కుర్చీలుంటున్నాయి. అందులో.. ఒక దాంట్లో పవన్.. మరో దాంట్లో… నాదెండ్ల మనోహర్. అంతే.. కాదు.. పవన్ కల్యాణ్ ఎక్కడుకు వెళ్లినా.. మనోహర్ పక్కనుంటున్నారు. పక్కన ఉండటమే కాదు.. ప్రతీ విషయంలోనూ… ఆయనే పవన్‌కు రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్‌గా వ్యవహరిస్తున్నారు. సరిగ్గా గమనిస్తే… పవన్ కల్యాణ్ బహిరంగసభల్లో ఆవేశపడేటప్పుడు.. తనకు అలవాటు లేకపోయినా.. నవ్వు ముంచుకొస్తున్నా… నాదెండ్ల మనోహన్ కూడా ఆవేశ పడేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అంతగా పవన్‌తో కలిసి పోయారన్న మాట. ఆ కలిసోపవడంతోటే.. నెంబర్ టూగా వెళ్లిపోయారు. దాంతో… వయసు మీద పడిపోయినా.. పవన్ కల్యాణ్ కోసం… అలీవ్ గ్రీన్ దుస్తులేసుకుని.. హడావుడి చేసిన మాదాసు గంగాధరం… పవన్ కోసం ఏకంగా టీవీ చానల్ ను కొని.. ప్రధాన కార్యదర్శిగా కొన్ని పెత్తనం చేసిన తోట చంద్రశేఖర్ సైడైపోవాల్సి వచ్చింది.
మొదట్లో మారిశెట్టి రాఘవయ్య.. ఆ తర్వాత తోట చంద్రశేఖర్, మాదాసు గంగాధంరల పేర్ల మీదుగా పార్టీ వ్యవహారాలు నడిచేవి. ఇప్పుడు అవి నాదెండ్ల చేతుల్లోకి వెళ్లాయి. దీంతో.. ఈ సీనియర్ నేతలు.. తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారట. కనీ ఎవరికి చెప్పుకోవాలో వారికి అర్థం కావడం లేదు. సమయం కోసం.. కామ్‌గా ఎదురు చూస్తున్నారు. ఈ సమయం ఎందుకంటే.. పక్క పార్టీల్లోకి జంప్ అవడానికి కాదు.. వారు వస్తామన్నా ఇతర పార్టీ నేతలు తీసుకోరేమో కానీ.. రేపు మరో.. కొత్త పాత్ర… పవన్ కల్యాణ్‌కు రాబోతుందా… నాదెండ్ల మనోహర్ తమ పక్కకు చేరబోతాడా.. అన్నదే…వారి ఆలోచన.. ఆసమయం కోసం.. వారు ఎదురు చూస్తున్నారట…!