రాజశేఖర్ వ్యవహారంతో.. టాలీవుడ్ పెద్దలంతా సీరియస్‌గా ఉన్నారు. రాజశేఖర్‌పై తక్షణం చర్య తీసుకోవాలని చిరంజీవి సైతం సూచించడంతో ఆయనపై యాక్షన్ తప్పదనిపిస్తోంది. ‘మా’ డైరీ ఆవిష్కరణలో భాగంగా రాజశేఖర్ దురుసుగా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. సభా మర్యాద కూడా పాటించని రాజశేఖర్‌పై ‘మా’ సభ్యులతో పాటు, చిత్రసీమ పెద్దలు ఫైర్ అవుతున్నారు. రాజశేఖర్ మాట్లాడి వెళ్లిపోయిన తరవాత… జీవిత వేదికపైకి వచ్చి మైకు అందుకుని రాజశేఖర్ ది చిన్నపిల్లాడి మనస్తత్వం అని, ఆయన్ని క్షమించమని కోరారు. తమ కుటుంబానికి ఎవరితోనూ ఎలాంటి విబేధాలు లేవని, నరేష్‌తో సైతం కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఈమాత్రం దానికి రాజశేఖర్ వేదికపై అంత సీరియస్ అవ్వడం ఎందుకు? ఏమైనా ఉంటే… కూర్చుని మాట్లాడుకోవాలి కదా అన్నది సినీ పెద్దల వాదన. జీవిత వచ్చి క్షమాపణలు చెప్పినంత మాత్రాన ఈ వివాదం చల్లారిపోయినట్టు కాదు. రాజశేఖర్ పై చర్య తీసుకోవడం దాదాపుగా ఖాయమైపోయింది. అయితే అది ఏ రేంజులో ఉంటుందన్నది మాత్రం తేలాలి.
రాజశేఖర్ మద్యం సేవించి వచ్చారా?
అయితే రాజశేఖర్‌పై మరో ఆరోపణ కూడా గట్టిగా వినిపిస్తోంది. ఈ కార్యక్రమానికి రాజశేఖర్ మద్యం సేవించి వచ్చారని, ఆ మత్తులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని కొంతమంది `మా` సభ్యులు ఆరోపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం పార్క్ హయత్‌లో `మా` కీలక సమావేశం జరిగింది. ప్రధాన ఎజెండా రాజశేఖర్‌పై తీసుకోవాల్సిన యాక్షన్ గురించే అని తెలుస్తోంది. మద్యం సేవించి రావడం నిజమని `మా` భావిస్తే గనుక ఆయనపై ఇంకాస్త కఠిన చర్యలు ఉంటాయని భావిస్తున్నారు.