తొమ్మిదంటే తొమ్మిది రోజులు ఉంది ‘కల్కి’ రిలీజ్ అవ్వడానికి. పాన్ ఇండియా బౌండరీలు దాటి, పాన్ వరల్డ్ సినిమాగా రాబోతోంది ‘కల్కి’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటిని నాగ అశ్విన్ అండ్ టీమ్ ఎంత వరకూ అందుకొంటుందన్నది అసలు ప్రశ్న. ఈ సినిమా కాస్త నిలబడితే ‘ఆర్.ఆర్.ఆర్’, `బాహుబలి` రికార్డుల్ని తిరగరాసే అవకాశం ఉంది.
అయితే ‘కల్కి’ ప్రమోషన్లు అనుకొన్నంత వేగంగా సాగడం లేదు. ఈ సినిమా నుంచి ఓ టీజర్, ఓ ట్రైలర్, ఓ పాట విడుదలయ్యాయి. ‘బుజ్జి’కి సంబంధించిన స్పెషల్ టీజర్ వదిలారు. ఓ ఈవెంట్ కూడా చేశారు. అంతకు మించి ఎలాంటి ప్రమోషన్ యాక్టివిటీ లేదు. తెలుగుకే ఈ సినిమా పరిమితం అయితే, ఈ హంగామా చాలు. కానీ ఇది పాన్ వరల్డ్ సినిమా. దేశమంతా ప్రచారం చేయాలి. చేతిలో సమయం మాత్రం లేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ పైనే ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ లేదు. ఫంక్షన్ ఎక్కడ చేయాలి, ఎవర్ని పిలవాలి? అనే విషయంలో చిత్రబృందం ఇంకా తర్జనభర్జనలు పడుతూనే ఉంది. విడుదల చేయాల్సిన ప్రమోషన్ కంటెంట్ చాలానే ఉంది. కానీ.. తగినంత సమయం లేదు. ఉన్న ఈ వారం రోజులే చిత్రబృందం ఎలా వాడుకొంటుందన్నది అసలు ప్రశ్న. నిజానికి ‘కల్కి’ టీమ్ ప్రమోషన్ని చాలా భారీగా ప్లాన్ చేసింది. కానీ ఏదీ వర్కవుట్ అవ్వడం లేదు. ‘బుజ్జి’ ఈవెంట్ ఒకటి హైదరాబాద్ లో జరిగింది కాబట్టి సరిపోయింది. లేదంటే.. ప్రమోషన్ యాక్టివిటీస్ ఇంకా డల్ గా కనిపించేవి. ఇప్పటికైనా వైజయంతీ మూవీస్ దూకుడు పెంచాల్సిన అవసరం ఉంది. ఇండియా వ్యాప్తంగా ఉన్నక్రేజ్ని క్యాష్ చేసుకోవాలంటే.. ఈ తొమ్మిది రోజులూ పరుగులు పెట్టాల్సిందే.