ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతలపై .. అదీ కూడా.. టీడీపీ ఆర్థిక వ్యవహారాలకు వెన్నుదన్నుగా ఉంటారని ప్రచారంలో ఉన్న నేతలపై.. వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. కనీసం ప్రతి ఒక్కరిపైనా వంద మందికి తగ్గకుండా.. ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. సోదాలు చేస్తున్నారు. ఏం తీసుకెళ్తున్నారో.. ఏం దొరకబుచ్చుకుంటున్నారో ఎవరికీ తెలియనివ్వడం లేదు. కొండను తవ్వి తొండను కూడా పట్టడం లేదని.. టీడీపీ నేతలు అపహాస్యం చేస్తున్నా..స్పందించేవారు లేరు. అసలు ఈ ఐటీ దాడులు ఎందుకు చేస్తున్నారన్న దానిపైనా… ఎవరికీ క్లారిటీ లేదు. కానీ ఐటీ దాడుల నేపధ్యం మాత్రం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలేననేది.. అందరికీ తెలిసిన బహిరంగ నిజం.
తెలుగుదేశం పార్టీ మహాకూటమిలో చేరకూడదని.. టీఆర్ఎస్ భావించింది. దాని కోసం… కొన్ని మీడియా సంస్థల ఆర్టికల్స్ ద్వారా ఒత్తిడి తెచ్చింది. హెచ్చరికలు చేసింది. టీడీపీ అసలు తెలంగాణలో లేనే లేదని తేల్చింది. ఎంత ఒత్తిడి వచ్చినా చంద్రబాబు.. మహాకూటమిలో భాగమయ్యారు. అప్పటి నుంచే గేమ్ ప్రారంభమయింది. తొలి ప్రచార సభలోనే.. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన చంద్రబాబు… కాంగ్రెస్‌కు మూడు హెలికాఫ్టర్లు, రూ. 500 కోట్లు సమకూర్చుతారని హామీ ఇచ్చారని ఆరోపించారు. అయితే.. అది ఆషామాషీగా చేసిన ఆరోపణ కాదు. అంతకు ముందు నుంచే.. బాల్క సుమన్, పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి నేతలు.. ఆరోపించిన మాటే. అంటే.. టీఆర్ఎస్ ఈ ప్రచారాన్ని గట్టిగా నమ్మిందన్నమాట. కాంగ్రెస్ పార్టీ కేంద్రనాయకత్వం వద్ద నిధులు లేవు. తెలంగాణ పార్టీకి సహకరించే పరిస్థితి లేదు. వస్తే గిస్తే.. చంద్రబాబునాయుడే ఇవ్వాలని.. కేసీఆర్ భావించారు. అందుకే.. ఆ నిధులు రాకుండా కట్టడి చేయాలని.. కేంద్రంలో ఉన్న ఫ్రెండ్లీ సర్కార్‌తో ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ ఫలితమే ఐటీ రెయిడ్స్ అన్న ప్రచారం జరుగుతోంది.
ఊరకనే.. ఏపీలోని టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేస్తే.. ఇబ్బంది పడతామని.. తెలుసు కాబట్టి.. రేవంత్ రెడ్డి దగ్గర్నుంచి లాక్కొచ్చారు. రేవంత్ రెడ్డి కేసుకు సంబంధించి.. రూ. 50 లక్షలు ఎక్కడ్నుంచి వచ్చాయో తేల్చాలంటూ.. ఏసీబీ నుంచి ఐటీ శాఖకు అధికారికంగా లేఖ వెళ్లింది. అదే ప్రారంభం. అప్పట్నుంచి స్క్రీన్ ప్లే ప్రకారం… రేవంత్ రెడ్డి ఇంటి నుంచి ప్రారంభించి.. టీడీపీకి ప్రధాన ఆర్థిక వనరులుగా భావించే ప్రతి ఒక్క నేతపైనా దృష్టి పెట్టారు. బీద మస్తాన్ రావు, పోతుల రామారావు, సుజనా చౌదరి, సీఎం రమేష్.. అందరూ ఆ తరహా నేతలే. వీరిలో ఎవరైనా.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేందుకు నిధులు సమీకరించినా.. సోదాల్లో దొరికిపోతారు. ఒక వేళ .. అదేమీ లేకపోయినా… ఐటీ సోదాలతో ఇవ్వాలనుకున్నా.. ఆగిపోతారు. అదే ఐటీ దాడుల అసలు ప్లాన్ trs strategy on tdp it raidsఅన్న అనుమానాలు సహజంగానే వస్తున్నాయి.