తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రెంట్ లో కాంగ్రెసేతర, భాజపాయేతర పార్టీలు మాత్రమే ఉండాలనేది ఆయన ఆలోచన. అలాంటి పక్షాలను ఏకం చేసే పనిలో కేసీఆర్ కొంత సతమతమౌతున్న పరిస్థితి. భాజపా అనుకూలవాదిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారనే కొన్ని విమర్శలూ వినిపిస్తున్నాయి. అయితే, రెండు జాతీయ పార్టీలు ప్రమేయం లేని ఫ్రెంట్ మనుగడపై చాలామందికి చాలా అనుమానాలున్నాయి. గతంలో ఇలా ఏర్పడిన ఫ్రెంట్ లు ఎక్కువకాలం అధికారంలో ఉండలేకపోయాయి. కాబట్టి, ఎన్నికల తరువాత ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతుతోనే కూటమి కడితేనే మంచిదనే అభిప్రాయం కొన్ని ప్రధాన ప్రాంతీయ పార్టీల్లో ఉందనేది స్పష్టం. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కీలకం అవుదామని భావిస్తున్న కేసీఆర్… తన అభిప్రాయాన్ని కొంత మార్చుకునే అవకాశం ఉందా? ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతుకు ఆయన కూడా ఓకే చెప్తారా అంటే… ఆ దిశగానే కొన్ని ప్రయత్నాలు మొదలైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
గత నెలలో పార్లమెంటు ఎన్నికల జరిగిన పదిరోజుల తరువాత, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఒక ప్రముఖ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడితో భేటీ అయినట్టుగా ఓ జాతీయ పత్రిక పేర్కొంది. కేంద్రంలో కలిసి పనిచేసే అవకాశాల మీదే ఈ ఇద్దరి మధ్యా చర్చి జరిగినట్టుగా సమాచారం. జాతీయ పార్టీ ప్రమేయం లేకుండా ఏర్పడిన ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవనీ, 1996 నాటి యునైటెట్ ఫ్రెంట్ అనుభవాన్ని ఈ సందర్భంగా ఇద్దరు నేతలు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానమంత్రి రేసులో తాను లేనంటూ చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడంతోనే తెరాస వైఖరిలో కొంత మార్పు వచ్చిందనేది ఆ కథనం సారాంశం.
తెరాస, కాంగ్రెస్ లు తెలంగాణలో అధికార ప్రతిపక్షాలుగా ఉన్నాయి. కాబట్టి, కాంగ్రెస్ కి ఆ పార్టీ మద్దతు సాధ్యమేనా అనే చర్చ ఉండనే ఉంది. అయితే, ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలకు సంబంధించి తెరాస ధోరణిలో కొంత మార్పు వస్తోందనే సంకేతాలు ఈ భేటీ ద్వారా ఇచ్చినట్టయింది. కాంగ్రెస్ ఎంపీతో తమ పార్టీ నేత భేటీ జరిగినా, అది కేవలం మర్యాద పూర్వకమైందే తప్ప… రాజకీయ అంశాలకు చర్చకు రాలేదంటూ తెరాస నేతలు అంటున్నారు. మొత్తానికి, భాజపాయేతర కాంగ్రెసేతర మూలసూత్రంలో కొంత మార్పు అవసరం అనేది కేసీఆర్ గుర్తించా