దేశ రాజకీయాల్లో కీల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకే దేశం – ఒకే ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. ఈ అంశంపై బీఆర్ఎస్ ఇంకా ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. నిజానికి జమిలీ ఉంటుందని కేసీఆర్ అనుకోలేదు. అందుకే పార్లమెంట్ పై దృష్టి పెట్టకుండా అసెంబ్లీ వరకే అభ్యర్థుల్ని ప్రకటించి.. వ్యూహాలు ఖరారు చేశారు. కానీ ఇప్పుడు లోక్ సభకు కూడా ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం నుంచి తమకు కనీస సమాచారం లేదని కేసీఆర్ ఫీలై ఉంటారు కానీ.. ఇప్పుడు ఏదో ఓ అభిప్రాయం వెల్లడించాల్సిన అవసరం ఏ్పడింది.
ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలకు పార్టీ అధినేత కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారని కీలకంగా మారాయి. జమిలి ఎన్నికలపై గతంలో కేంద్ర లా కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించిన సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ ప్రతినిధులు పలు కారణాలను చూపి సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా తెరమీదకు రావడంతో అసెంబ్లీ ఎన్నికల మీద పడే ఎఫెక్టుతో చర్చ సందర్భంగా పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిరకంగా మారింది.
జమిలి ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ గతంలో జై కొట్టింది. కేంద్ర ఎన్నికల కమిషన్, కేంద్ర లా కమిషన్ వేర్వేరుగా నిర్వహించిన సమావేశాలకు బీఆర్ఎస్ ప్రతినిధిగా హాజరైన అప్పటి ఎంపీ వినోద్ కుమార్ ఈ విధానానికి అనుకూలంగానే అభిప్రాయాలను వెల్లడించారు. అవి ఆ రెండు కమిషన్ల రికార్డుల్లో నమోదయ్యాయి. అయితే అసలు కేసీఆర్ ఉద్దేశం ప్రకారం లోక్ సభ కు అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు నష్టం. అందుకే విడిగా ముందస్తుకు వెళ్లారు గంతలో.
ఈ సారి ముందస్తు ఎన్నికల అవసరం లేకుండా లోక్సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా జరుగుతాయని భావించి దానికి తగినట్లుగా పార్టీ వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారు. ఇప్పుడు రివర్స్ అయింది. తమ పార్టీకి ఎఫెక్ట్ అవుతుందనుకుంటే కేసీఆర్ వ్యతిరేకించే అవకాశం ఉంది.