తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్కు ఓ ఊతపదం ఉంది. అదేమిటంటే.. మెడ నరుక్కోవడం. ప్రజల్లో భావోద్వేగాలు పెంచాలనకున్నా… తన మాటలపై .. నమ్మకం కలిగించాలనుకున్నా.. .ఆయన మెడ నరుక్కుంటానంటూ సవాల్ చేస్తూంటారు. అలాంటివి చాలా ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడే తొలి ముఖ్యమంత్రి…. అని ప్రకటించారు. దీన్ని నమ్మించడానికి ఆయన కేసీఆర్ మాటంటే మాటే… అవసరం అయితే మెడ నరుక్కుంటా కానీ.. ఆడిన మాట తప్పేది లేదని ప్రకటించారు. అందరూ జయహో కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడింది. దళితుడ్ని కేసీఆర్ ముఖ్యమంత్రిని చేయలేదు. అలా అని మెడ నరుక్కోలేదు. ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఇలాంటి మెడ నరుకుడు హామీలు.. కుప్పలు తెప్పలు… దళితులకు మూడెకరాల భూమి దగ్గర్నుంచి డబుల్ బెడ్ రూం ఇళ్ల వరకూ.. ఆయన ప్రజలు నమ్మరు అనుకున్న ప్రతి ఒక్క హామీకి “మెడ నరుకుడు ” హమీ పత్రం రాసిచ్చారు. అవన్నీ అలా పెండింగ్లో ఉండిపోయాయి.
ఏపీకి ప్రత్యేకహోదా తెలంగాణకు ద్రోహం అని అనలేదా..?
ఇప్పుడు కేసీఆర్ ఏపీకి ప్రత్యేకహోదా గురించి మాట్లాడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు తెలుపుతూ… మొదట్లో… పార్లమెంట్లో కేకే, కవిత మాట్లాడారు. అప్పుడు… అసలు విభజనే అశాస్త్రీయం.. ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని.. సానుభూతి వెల్లువెత్తుతున్న సమయంలో … అసలు విభజన చట్టమే అన్యాయమని… చెబుతున్న సమయంలో… జరిగిన చర్చల్లో ఈ మాటలన్నారు. తర్వాత ఏమన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టలేదా..? ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం తెలంగాణకు ద్రోహం చేయడం అని మాట్లాడలేదు. ఎప్పటిదాకో ఎందుకు.. గత అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రచారాస్త్రం .. ఏపీ ప్రత్యేకహోదా కాదా..? ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తానంటున్న కాంగ్రెస్.. తెలంగాను బొంద పెట్టాలనుకుంటోందని… ప్రతి సభలోనూ చెప్పలేదు. వందిమాగధులు మొత్తం ఏపీపై విద్వేషాన్ని పెంచి.. ప్రత్యేకహోదానే బూచిగా చూపి ఓట్లను రాబట్టారు కదా..!
ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి తెలంగాణను టీఆర్ఎస్ బొంద పెడుతుందా..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం…. పరమైన ఘోరమైన హామీగా.. తెలంగాణకు అత్యంత.. దారుణంగా అవమానించే హామీగా… చెప్పుకొచ్చిన టీఆర్ఎస్.. ఇప్పుడు.. ఏపీకి ప్రత్యేకహోదాకు మద్దతిస్తామని ఎలా చెబుతుంది..? రాజకీయ ప్రయోజనాల కోసం.. ఏపీలో.. తమ మిత్రపక్షం.. టీఆర్ఎస్ ను గెలిపించడానికి… సొంత రాష్ట్ర ప్రయోజనాల్ని కూడా బలి పెడుతుందా..? టీఆర్ఎస భాషలో చెప్పాలంటే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా.. హైదరాబాద్ పరిశ్రమలను ఏపీకి తరలించడానికి అంగీకరిస్తారా..? తెలంగాణ పారిశ్రామిక రంగం మొత్తం ఏపీకి వెళ్లడం వారికి అంగీకారమేనా..? చివరికి.. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం.. తెలంగాణకు బొంద పెట్టడమేనన్న.. టీఆర్ఎస్ నేతల విమర్శలు ఇక్కడ నిజమేనా..? ఏపీకి ప్రత్యేకహోదా తెప్పించి.. తెలంగాణను.. టీఆర్ఎస్ బొంద పెట్టబోతోందా..?
తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా టీఆర్ఎస్ వ్యవహరించగలదా..?
ఏపీలో టీఆర్ఎస్కు ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవు. అక్కడ ఆ పార్టీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండరు. నిజంగా.. రేపటి రోజున.. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన పరిస్థితే వస్తే.. కేసీఆర్ ఎలా మద్దతుగా నిలబడతారు..? ఆయనకు సొంత రాష్ట్రంలో ప్రయోజనాలు ఉన్నాయి. అది ప్రభుత్వ పరంగా ఉన్నాయి. రాజకీయ పరంగా ఉన్నాయి. అవి నేరవేర్చుకోవాలంటే.. ఆయనకు ఉన్న ఆయుధం ప్రత్యేకహోదా వ్యతిరేకత. ఇప్పుడు… జగన్ ను బుట్టలో వేసుకునేందుకు ప్రత్యేకహోదాకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటనలు చేస్తున్నా.. రేపు అసలు విషయం వచ్చే సరికి తెలంగాణకు ఇస్తేనే.. ఏపీకి ఇవ్వాలని పట్టుబట్టరని గ్యారంటీ ఏమిటీ..? అసలు ఏపీ కోసం.. టీఆర్ఎస్ పని చేస్తుందని.. నమ్మేంత అమాయకుడా జగన్..?
—సుభాష్