ఏపీలో అధికార మార్పిడిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వైసీపీకి సపోర్ట్ గా ఈ వ్యాఖ్యలు చేయడంతో కూటమి నేతల నుంచి ఊహించని ఎదురుదాడి మొదలైంది. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ గా మంత్రి సత్యకుమార్ చేసిన ట్వీట్ బీఆర్ఎస్ , వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసింది.
కూటమి నేతలు కేటీఆర్ పై విమర్శలు చేస్తున్నా వైసీపీ నేతల నుంచి మాత్రం రియాక్షన్ లేకపోవడం చర్చనీయాంశం అయింది. ఒక్కరూ కేటీఆర్ ను సమర్ధిస్తూ, కూటమి నేతలకు కౌంటర్ ఇచ్చేందుకు మీడియా ముంగిటకు వచ్చే సాహసం చేయలేదు. వైసీపీకి అనుకూలంగా కేటీఆర్ మాట్లాడినా ఆ పార్టీ నుంచి స్పందన లేకపోవడం బీఆర్ఎస్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
మిత్ర ధర్మం పాటిస్తూ కూటమి నేతల చేతిలో కేటీఆర్ అనవసరంగా బుక్ అయ్యాడంటూ రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేటీఆర్ మిత్రధర్మం పాటిస్తున్నాడు.. జగన్ రెడ్డే పాటించడం లేదని, అందుకే కేటీఆర్ పై ఎదురుదాడి కొనసాగుతున్నా కౌంటర్ ఇచ్చేందుకు ఆ పార్టీ నేతలను పురమాయించడం లేదని అంటున్నారు.