సర్కారు వారి పాట కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకూ.. ఇక్కడే షూటింగ్. ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి, త్రివిక్రమ్ కి డేట్లు ఇవ్వాలని చూస్తున్నాడు మహేష్. అయితే ఇప్పటి వరకూ మహేష్ కి విలన్ ఎవరన్నది ఫిక్స్ అవ్వలేదు. ఉపేంద్ర, అరవింద్ స్వామి లాంటి పేర్లు పరిశీలనకు వచ్చినా.. ఎవరూ ఖరారు కాలేదు. ఇప్పుడు చిత్రబృందం మాధవన్ తో సంప్రదింపులు జరిపినట్టు టాక్. ఆ పాత్రకు మాధవన్ దాదాపు ఓకే అయిపోయాడని తెలుస్తోంది.
అయితే మాధవన్ ట్రాక్ రికార్డు ఈమధ్య బాగా భయపెడుతోంది. సవ్యసాచిలో తనే విలన్. కానీ ఆ సినిమా ఫ్లాప్. నిశ్శబ్దంలోనూ తానే విలన్. ఆ సినిమా కూడా పోయింది. అందుకే మాధవన్ దగ్గరకు వెళ్లాలా? వద్దా? అని తర్జన భర్జనలు పడ్డారు. అయితే… అరవింద్ స్వామి, ఉపేంద్ర డేట్లు ఖరారు కాకపోవడంతో.. ఆ తరవాతి బెస్ట్ ఆప్షన్ మాధవన్ అని చిత్రబృందం భావిస్తోంది. అందుకే రేసులోకి మాధవన్ వచ్చినట్టు టాక్.