మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్. తండ్రి వారసత్వంగా ఆ ”సూపర్ స్టార్’ ట్యాగ్ వచ్చేసిందని అనుకుంటే పొరపాటే. మహేష్ బాబు మాములు హార్డ్ వర్క్ చేయలేదు. ఆయన సినీ ప్రయాణం కూడా అంత ఈజీగా సాగిపోలేదు. ‘రాజకుమారుడు’ నుండి మొదలు పెట్టి అంచలంచాలుగా ఎదిగి ”సూపర్ స్టార్’ అని ప్రేక్షకుల చేతనే అనిపించుకున్నాడు మహేష్. ఇక్కడ హీరోగా నిలబడటం అంత ఈజీ కాదు. ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోయే ఈ పరిశ్రమలో నిలదొక్కుకోవడం, అదీ టాప్ సీడ్ ను నిలబెట్టుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. చాలా ఫోకస్ అవసరం. మహేష్ బాబు కూడా అంతే ఫోకస్ తో తన కెరీర్ ను మలచుకున్నాడు. మొదట్లో ఎత్తుపల్లాలను చుసినా.. ‘ఒక్కడు’ సినిమా తర్వాత ఆయన ప్రయాణం గాడిలో పడిపోయింది. అయితే ఎంత గాడిలో పడ్డా ఒక సినిమా నిరాశ పరిచిందంటే మళ్ళీ జాగ్రత్తపడి నిలబడాల్సిన పరిస్థితి వుటుంది.
అయితే ఇప్పుడు మహేష్ కూడా మళ్ళీ గాడిలో పడాల్సిన అవసరం వుందా ? అంటే తప్పాకుండా వుందనే అభిప్రాయం వినిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి వరుసగా రెండు పరాజయాలు ఎదురయ్యాయి. మధ్యలో వచ్చిన ‘శ్రీమంతుడు’ ‘గ్రామల దత్తత’ అంటూ ఏదో ఊపునిచ్చినా దానికి ముందు వచ్చిన ఆగడు, వన్ సినిమాల రిజల్ట్ మర్చిపోకూడదు. మధ్యలో ‘శ్రీమంతుడు’ పక్కన పెడితే నాలుగు ఫ్లాఫులు చూశాడు మహేష్.
వన్ సినిమాని ప్రయోగాత్మక సినిమా అంటారు కొందరు. నాలుగు పాటలు, ఒక ఐటెం సాంగ్, ఐదు ఫైట్లు.. ఇలా కమర్షియల్ కొలమానాలతో తీసిన ఆ సినిమా ఎలా ప్రయోగాత్మక సినిమా అవుతుందో వాళ్ళకే తెలియాలి. ఈ సినిమా ఆసాంతం పక్కా కమర్షియల్ పక్తులో సాగిందని చెప్పకతప్పదు. అది కాస్త అలా బెడిసికొట్టేసింది. దూకుడు ఇచ్చాడు అనే అభిమానంతో ‘ఆగడు’కి ఛాన్స్ ఇస్తే.. శ్రీను వైట్ల తన ట్యాలెంట్ మొత్తం చూపించి ఓ నిఖార్శయిన ఫ్లాఫ్ ఇచ్చేశాడు.
ఇక బ్రహ్మోత్సవం సంగతి అందరికీ తెలిసిందే. అంతకుముందు సీతమ్మ వాకిట్లో లాంటి సిరిమల్లె చెట్టు లాంటి క్లాస్ సినిమా ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాలకు మరోసారి ఛాన్స్ ఇచ్చిన మహేష్ దారుణమైన ఫలితాల్ని చూశాడు. అసలు ఇందులో ఏముంది? ఈ సినిమా చేయాల్సిన అవసరం ఏముంది? అన్నంత రేంజ్లో ఈ సినిమా ఫ్లాఫ్ అయిపోయింది. అసలు ఏం పాయింట్ కి మహేష్ బాబు ఫ్లాట్ అయిపోయాడు అని అంతా ముక్కునవేలేసుకున్నారు.
ఇప్పుడు స్పైడర్ పరిస్థితి కూడా ఇలానే వుంది. మహేష్ బాబు అభిమానులే ఈ సినిమాపై పెదవి విరిచారు. దర్శకుడు మురగదాస్ ను ఆడిపోసుకుంటున్నారు. ‘మా సూపర్ స్టార్ ని ఒక సెల్ ఫోన్, కూర్చికి కట్టేసి .. ఏం గొప్ప ‘సైకో’ సినిమా తీశాడు” అంటూ గొనుక్కుంటున్నారు. నిజమే.. రమణ, కత్తి, గజనీ, తుపాకి.. లాంటి యూనివర్షల్ కధలను హ్యాండిల్ చేసిన మురగదాస్.. ఒక సైకోకి బిల్డప్ ఇస్తూ మహేష్ బాబుని కూర్చికి పరిమితం చేసి ఒక ‘అరవ వాసన’ సినిమా తీశాడు. ఈ విషయంలో మహేష్ అభిమానుల ఆవేదనకు అర్ధం వుంది. అయితే ఇక్కడ ఎవరినీ తప్పుపట్టలేం. మహేష్ బాబే స్టొరీ సెలక్షన్ లో కాస్త జాగ్రత్తగా వుండాల్సింది. ఇప్పుడు అనుకుని ఏం లాభం లేదు.
ఇప్పుడీ నాలుగు సినిమాల రిజల్ట్ ని చూసిన తర్వాత మహేష్ బాబు కధలు ఎంపిక విషయంలో దారితప్పుతున్నారా ? అనే అభిప్రాయం కలుగుతుంది. వాస్తవానికి మహేష్ బాబుకి కధ చెప్పి ఒప్పించడం చాలా కష్టం అనే టాక్ వుంది. అలాంటి మహేష్ ఇలాంటి కధలను ఎంపిక చేసుకోవడం ఏమిటో అర్ధం కాదు. ఇక్కడ మరో పాయింట్.. గత కొనేళ్ళుగా మహేష్ బాబు ఒక సెటప్ లో సినిమాలు చేస్తున్నారు. తనకు కంఫర్ట్ గా వుండే జోన్ నిర్మాతలతోనే లాగించేస్తున్నారు. దీంతో వాళ్ళు తెచ్చిన కధలే ఫైనల్ అయిపోతున్నాయి. ఒక సినిమా అయిపోయిన వెంటనే.. తన దగ్గర వున్న నిర్మాతల్లో వున్న లైన్స్ లో ఎదో ఒకటి ఓకే చేసి సెట్స్ పైకి వెళుతున్నారు. ఒక సినిమాకి బిజినెస్ కంటే క్రియేట్ బిజినెస్ ఎక్కువ వుండాలి. అప్పుడే ఆ సినిమా పదికాలాలు నిలిచిపోతుంది. అయితే మహేష్ ఈ క్రియేటీవ్ ప్రోసన్ ను తనకు తానే లిమిట్ చేసుకుంటున్నారనే ఒపినియన్ వినిపిస్తుంది. ఈ విషయంలో మహేష్ కాస్త ఓపెన్ గా వుంటే బెటర్. కొత్త వాళ్ళు చెప్పే కధలు చేయకపోయినా పర్వాలేదు. కనీసం వినడానికైనా అవకాశం ఇవ్వాలి. ఒక డైరెక్టర్ కి ఫిక్సయిపోయి..ఆయన తెచ్చిన కధే ఫైనల్ అనుకుంటూ పొతే .. రిజల్ట్ స్పైడర్ లానే ఉటుంది.
వాస్తవానికి బ్రహ్మోత్సవం ఫ్లాఫ్ తర్వాత మహేష్ నుండి వచ్చిన స్పైడర్ పై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. బ్రహ్మోత్సవంలో జరిగిన తప్పు జరగదని, కధ విషయంలో మహేష్ మరింత జాగ్రత్తపడివుంటాడని అనుకున్నారంత. కానీ మహేష్ మళ్ళీ కధ విషయంలో విఫలమయ్యాడు. అభిమానులు తన నుండి ఏం ఆశిస్తూన్నారో పసిగట్టడంలో తడబడ్డాడు. కధ కంటే దర్శకుడిని ఎక్కువ నమ్మేశాడు. అదే కొంప ముంచేసింది. బ్రహ్మోత్సవం నయం. తెలుగు సినిమా అనే ఫీలింగ్ తో చూసేశారు. స్పైడర్ లో అరవ దరువు మరీ శ్రుతిమించిపోయింది. బిగినింగ్ లోనే డబ్బింగ్ సినిమా చూస్తున్నామా ? అనే ఫీలింగ్ వచ్చేసింది. బహుసా మహేష్ తను వున్న సీన్లు మాత్రమే చూసుకున్నాడేమో. ఈ సినిమాని ప్రతి షాట్ తెలుగులో తమిళ్ లో రెండు సార్లు షూట్ చేసామని చెప్పారు. ఇది పచ్చి అబద్ధమని సినిమా చూసిన తర్వాత తెలిసిపోయింది. స్పైడర్ ని ఎవరో క్రిస్టఫర్ నోలన్ తీసిన ‘డార్క్ నైట్’ తో పోల్చారు. అందులో జోకర్.. ఇందులో సైకో అంటా. భయంకరమైన అజ్ఞానం ఇది. డార్క్ నైట్ కి స్పైడర్ కి.. డే కి నైట్ కి వున్నంత తేడా వుంది.
మొత్తమ్మీద స్పైడర్ తో మరో నిరాశ జనకమైన ఫలితం వెళ్ళింది మహేష్ ఖాతాలోకి. గత కొన్నాళ్ళుగా కధలు ఎంపికలో మహేష్ బాబు చేస్తున్న పోరాపాట్లను మరోసారి ఎత్తిచూపించింది స్పైడర్. అయితే ఈ పరాజయం నుండి బయటపడటం ప్రిన్స్ కి పెద్ద కష్టం ఏమీ కాదు. ఇప్పుడు మహేష్ ముందు వున్న కర్తవ్యం.. అభిమానులు పండగ చేసుకొనే ఓ సినిమా అందించాడు. ఓ మంచి కధతో ప్రేక్షకుల్లో ఆనందం నింపడం. ఓ నిఖార్షయిన హిట్ పడితే ఈ పరాజయాలన్నీ తుడిచుకుపోతాయి. ప్రస్తుతం మహేష్ కొరటాల ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతోనే మహేష్ కి ఆ అదిరిపోయే హిట్ పడిపోవాలని కోరుకుందాం.