మహేష్ బాబు వెరీ కూల్. కుటుంబం, సినిమాలు తప్పితే మరో ప్రపంచం వుండదు. అనవసరమైన అంశాలలో తలదూర్చడం,లేనిపోనీ వివాదాల జోలికి వెళ్ళే రకం కాదు. కుదిరితే తన వంతు చారిటీ అందించి అరద్శంగా నిలుస్తుంటారు తప్పితే.. సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై ఓవర్ గా రియాక్ట్ అయిపోవడం,కామెంట్లు కొట్టేయడం వంటి పనులకు చాలా దూరంగా వుంటారాయన. ఒక్కమాటలో చెప్పాలంటే విమర్శ, వివాదరహితుడు మహేష్ బాబు. అలాంటి మహేష్ బాబు ఇప్పుడు ఓ విషయంలో తనవైపు వేలు చూపించేలా చేసుకున్నారు. ‘జల్లికట్టు’ వివాదం మహేష్ ని కార్నర్ చేసింది.
తమిళనాడులో జల్లికట్టు వివాదం పెద్ద ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై టాలీవుడ్ నుండి ఇద్దరు ప్రముఖ హీరోలు స్పదించారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. జల్లికట్టు తమిళుల సంప్రాదాయ క్రీడని, అది వుండాల్సిందేనని తమ అభిప్రాయాని వెల్లడించారు ఈ ఇద్దరు. పవన్ కళ్యాణ్ మాట పక్కన పెట్టండి. పవన్ ది డబల్ యాక్షన్. ఇటు సినిమా అటు రాజకీయా ప్రయాణం చేస్తున్నారు పవన్. ఇలాంటి అంశాలపై ఎన్ని అభిప్రాయాలైన వెల్లడించి, ఎన్ని వివరణలైనా ఇవ్వడానికి ఆయన సిద్ధం. అయితే మహేష్ బాబు నుండి ఈ తరహా వ్యాఖ్యలు రావడం చర్చనీయంశమైయింది. ఇప్పుడు అదే మహేష్ ని ఏపీకి స్పెషల్ స్టేటస్ విషయంలో ప్రశ్నించేలా చేసింది.
జల్లికట్టు ఉద్యమ స్పూర్తితో కేంద్రం మెడలు వంచేందుకు సిద్ధం కావాలని నినాదాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు జనవరి 26న విశాఖలోని ఆర్కే బీచ్‌లో ఏపీ యువత మౌన నిరసన కార్యక్రమం చేపడుతోంది. ఈ నిరసనకు జనసేన అధ్యక్షుడు గా పవన్‌కల్యాణ్ ఇప్పటికే మద్దతు ప్రకటించేశారు. పవన్ కళ్యాణ్ మాటతో ఇంకా కొందమంది టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కదిలారు. వరుణ్‌తేజ్,సాయిధరమ్‌తేజ్ , సందీప్ కిషన్, తనీష్, శివబాలాజీ, సంపూర్ణేష్ బాబు.. ఇల్లా తమ వంతు మద్దత్తు తెలుపుతూ ట్వీట్లు పెడుతున్నారు. ‘స్పెషల్ స్టేటస్ మన హక్కు. సాధించుకుందాం’అంటూ నినదిస్తున్నారు. ఇప్పుడు అందరి ద్రుష్టి మహేష్ బాబు వైపుకు వెళ్ళింది. జల్లికట్టుకు మద్దత్తు తెలిపిన మహేష్ బాబు .. ఇప్పుడు ఆ స్ఫూర్తితో జరుగుతున్న స్పెషల్ స్టేటస్ పోరాటానికి మద్దత్తు ఇవ్వరా ? పక్క రాష్ట్రం సంప్రాదాయంపై అంతలా ఆవేదన పడిన మహేష్ సొంతం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించారా ? స్పందించారా ? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయిప్పుడు. మరి ఈ విషయంలో మహేష్ స్పందిస్తారా ? మద్దత్తుగా నిలబడతారా? వెయిట్ అండ్ సీ.