బెంగాల్ లో జరిగిన పరిణామాలలో అక్కడి ముఖ్యమంత్రి మమతా బెనర్జీదే తప్పని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది. మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్నది తమ పార్టీ అభిప్రాయమని.. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి జాతీయ మీడియా చానళ్లకు ఇచ్చిన ఇంటర్యూల్లో స్పష్టం చేశారు. మమతా బెనర్జీ ధర్మవిరుద్ధంగా ప్రవర్తించినందుకే.. మద్దతివ్వలేదన్నారు. సీబీఐ అధికారులకు సహకరించడం రాష్ట్ర ప్రభుత్వ ధర్మమని.. చెప్పుకొచ్చారు. మమతా బెనర్జీ తప్పు చేశారని.. వైసీపీ నేత తీర్మానించారు. తప్పు చేయకపోతే.. సీబీఐ విచారణకు ఎందుకు సహకరించలేదని ఆయన ప్రశ్నించారు. బెంగాల్ వ్యవహారంలో.. మొత్తంగా మోదీ సర్కారుకే.. వైవీ సుబ్బారెడ్డి అవుట్ రైట్ సపోర్ట్ ప్రకటించినట్లియంది.
ఎలాంటి సమన్లు లేకుండా.. బెంగాల్ పోలీస్ కమిషనర్ ఇంటిపైకి దాదాపు యాభై మంది సీబీఐ అధికారులు దాడులకు వెళ్లడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మోడీ ప్రమేయంతోనే సీబీఐ ఇలా వ్యవహరించిందని ఆరోపిస్తూ.. మమతా బెనర్జీ .. మూడు రోజుల పాటు దీక్ష చేశారు. పోలీస్ కమిషనర్ ను సుప్రీంకోర్టు ముందు హాజరు కావాలన్న సుప్రీంకోర్టు ఆదేశం తర్వాత దీక్ష విరమించారు. మమతా బెనర్జీ దీక్షకు… బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ… మద్దతు పలికాయి. వారంతా ఢిల్లీకి వెళ్లి మమతా బెనర్జీకి సంఘిభావం ప్రకటించారు. అయితే.. తెలుగు రాష్ట్రాల నుంచి టీఆర్ఎస్, వైసీపీ మాత్రమే… బెంగాల్ పరిణామాలపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. రాష్ట్రాల హక్కుల కోసం… ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. రెండు సార్లు మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. అయినప్పటికీ.. కేసీఆర్ బెంగాల్ పరిమామాలపై స్పందించకపోవడంపై విమర్శలు వచ్చాయి.
అదే సమయంలో అదే ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామి అవ్వాలని నిర్ణయించుకున్న వైసీపీ కూడా సైలెంట్ గా ఉంది. మమతా బెనర్జీకి సంఘిభావం తెలియజేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం… జాతీయ చానళ్లకు పిలిచి మరీ.. మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించాని.. ప్రకటనలు చేస్తున్నారు. మోడీకే తమ మద్దతు అని పరోక్షంగా చెబుతున్నారు. కొద్ది రోజులుగా.. వైసీపీ, టీఆర్ఎస్ బీజేపీ అనుకూల ఫ్రంట్ లో ఉన్నాయని.. ఆ పార్టీలు.. మోడీ వైపే అడుగులేస్తున్నాయన్న విశ్లేషణలు ఢిల్లీ స్థాయిలో వస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు కూడా అదే నిరూపిస్తున్నాయి.