బీఆర్ఎస్ నేతలు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో కానీ వారు మాత్రం ప్రజల్ని తక్కువగా అంచనా వేస్తున్నారు. వారికి విషయ పరిజ్ఞానం ఏదైనా ఉంది అంటే అది తాము ఇచ్చేదే అన్నట్లుగా ఉంటున్నారు. ఈ విషయంలో మేడిగడ్డ వ్యవహారం మరోసారి నిరూపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ ఓ వైపు కుంగిపోయిందన్నది ప్రజలు చూశారు. ఎంత ఘోరమైన నిర్మాణమో నిపుణులు చెప్పారు. ఇప్పుడు గోదావరికి వరద వస్తూండటంతో .. బ్యారేజ్ మీదుగా నీరు పారుతోంది. అయితే ప్రాజెక్టు కొట్టుకుపోలేదు. అందుకే కేటీఆర్ దగ్గర నుంచి కింది స్థాయి వరకూ… కేసీఆర్ అద్భుతమైన కట్టడం కట్టించారని ప్రశంసించడం ప్రారంభించారు.
నిజానికి మీడియా వాచ్ : మేడిగడ్డ కుంగితే టీవీ9కు వార్త కాదా !? నీళ్లు నిలపడం లేదు. ప్రాజెక్టు కూలిపోతుందనే ఆ పని చేస్తున్నారు. పొరపాటున గేట్లు వేసేస్తే… ఆ కుంగిన భాగం నుంచి నీళ్లు వెళ్లేందుకు ప్రయత్నిస్తాయి. ఫలితంగా ప్రాజెక్టు డ్యామేజీ అవుతుంది. అందుకే నీళ్లు నిలిపేందుకు ప్రయత్నించవద్దని నిపుణులు తేల్చేశారు. అసలు నీళ్లు నిలబెట్టలేని ప్రాజెక్టు కట్టారని కాంగ్రెస్ నేతలు రివర్స్ దాడి ప్రారంభించారు. మేడిగడ్డ అనేది బ్యారేజీ. ఎత్తిపోతల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఇక్కడ పనికి రాదని.. నిపుణులు చెబుతున్నారు.
Read Also : ఆ బ్యారేజ్ లు దెబ్బతినడానికి రీజన్ ఏంటి..?
ప్రాజెక్టు నిర్మాణం నాసిరకం అని వస్తున్న ఆరోపణలకు.. నీళ్లు పారుతున్న దృశ్యాలతో చెక్ పెట్టామని బీఆర్ఎస్ అనుకుంటోంది. అక్కడ బ్యారేజీ లేకపోయినా నీళ్లు పారేవి. ఎందుకంటే అవేమీ ఎత్తిపోసిన నీళ్లు కాదు. వరద ప్రవాహం. వాటిని ఆపే పరిస్థితి లేదని.. ఎత్తిపోసుకునే అవకాశం లేని ప్రాజెక్టును నిర్మించడమే అసలు విషాదం. దీన్ని కప్పి పుచ్చకునేందుకు తమ సోషల్ మీడియా సైన్యాలతో విస్తృతంగా ప్రచారం చేసేసుకుంటున్నారు. ప్రజల్ని ఎలా కూడా నమ్మించవచ్చని భావిస్తున్నారు.