చిత్రసీమలో ప్రేమాయణాలు కొత్త కాదు. ఓ కథానాయికో, కథానాయకుడో డేటింగులోనూ, మరొకరితో రిలేషన్లోనో లేరంటే… అదే గొప్ప న్యూసు. అందుకే హాట్ హాట్ లవ్ కహానీలు… తరచూ వినిపిస్తూనే ఉంటుంటాయి. తాజాగా శ్రుతిహాసన్ ప్రేమ్ కహానీ కూడా బయటకు వచ్చింది. ఇటీవల మైఖెల్ అనే ఓ లండన్ యువకుడితో శ్రుతి చాలా క్లోజ్‌గా ఉంటోందట. ఈమధ్య ఓ ఎయిర్ పోర్ట్‌లో వీరిద్దరూ జాయింటుగా కనిపించడంతో అసలు మైఖెల్ ఎవరు? అతనికీ శ్రుతికీ ఏంటి లింకు? అనే కోణంలో ఆరాలు మొదలైపోయాయి. లండన్‌లోని థియేటర్ ఆర్టిస్టు ఈ మైఖెల్. ఓసారి శ్రుతి లండన్ వెళ్తే.. అక్కడ మైఖెల్ పరిచయం అయ్యాడట. అది కాస్త స్నేహంగా మారిందని టాక్. ఈమధ్య వాలెంటెన్స్ డే సందర్భంగా మైఖెల్ శ్రుతిని కలుసుకోవడానికి ప్రత్యేకంగా లండన్ నుంచి.. ఇక్కడికి వచ్చాడట. అప్పటి నుంచీ.. శ్రుతితోనే చక్కర్లు కొడుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది.
కొన్ని బాలీవుడ్ ఛానళ్లలో, ముంబై పత్రికలలో శ్రుతి – మైఖైల్లపై ప్రత్యేక కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. అయితే వీటిపై శ్రుతి ఇప్పటి వరకూ స్పందించలేదు. దాన్ని బట్టి… వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నిజమే కాబోసు అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారని, శ్రుతి ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షం అయిపోవడం మైఖెల్ అలవాటుగా మార్చుకొన్నాడని. చెన్నై, హైదరాబాద్‌లలోని సినీ సర్కిల్స్‌లో కూడా వీరి వ్యవహారం గురించి తెలుసని చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం కాటమరాయుడు షూటింగ్ లో బిజీగా ఉంది శ్రుతి. షూటింగ్ అయిపోగానే… మైఖెల్తో షికార్లు మొదలెట్టేస్తోందట. అయితే… ఇలాంటి పుకార్లకు శ్రుతి పెద్ద ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కామ్‌గా తన పని తాను చేసుకొంటూ పోతోంది. అయితే మీడియా ముందుకొస్తే మాత్రం తప్పకుండా ఈ డొంకంతా కదలడం ఖాయం. అప్పుడు శ్రుతి ఏం సమాధానం చెబుతుందో మరి.