తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మోదీకి సరైన కౌంటర్ ఇస్తూ నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఎన్డీఏ సమావేశంలో కర్ణాటక, తెలంగాణల్లో తమకు ఎక్కువ సీట్లు వచ్చాయని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయాయని చెప్పుకు వచ్చారు. దీనిపై రేవంత్ రెడ్డి ఊహించని విధంగా స్పందించారు. అలా అయితే మహారాష్ట్ర, యూపీలో బీజేపీకి ఏమైనా ఎక్కువ సీట్లు వచ్చాయా ? అక్కడ ఇంకా ఎందుకు బీజేపీ, మిత్రపక్షల ప్రభుత్వం నడుస్తున్నాయో చెప్పాలన్నారు.
రేవంత్ రెడ్డిది లాజిక్కే కదా అని రాజకీయవర్గాలు కూడా ఆలోచంచడం ప్రారంభించాయి. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఘోరంగా సీట్లు తగ్గిపోవడంతో ఆ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాస్త ఎక్కువ సీట్లు తెచ్చుకున్నామని ఆయా ప్రభుత్వాలకు కొనసాగే అర్హత లేదన్నట్లుగా చెప్పారు. అదే ఫార్ములా బీజేపీకి అన్వయిస్తే.. యూపీతో పాటు మహారాష్ట్ర కూడా ఎగిరిపోతుంది.
లోక్ సభ ఎన్నికల్లో ఓటర్ల ప్రాధాన్యం వేరు. తెలంగాణలో బీఆర్ఎస్ బలహీనపడటం వల్ల బీజేపీకి నాలుగు సీట్లు పెరిగాయి. గెలుపొందిన వాటిలో అతి మెదక్, మహబూబ్ నగర్ వంటి చోట్ల అతి తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. రేవంత్ రెడ్డి ఇచ్చి కౌంటర్.. జాతీయ మీడియాలోనూ హైలెట్ అవుతోంది.